Nov 27,2023 19:32
మాట్లాడుతున్న కమిషనర్‌

మాట్లాడుతున్న కమిషనర్‌
నాణ్యమైన పరిష్కారాలు అందించాలి
..- కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌, ఐఎఎస్‌
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కార మార్గం చూపించి, ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ పేర్కొన్నారు.నగర పాలక సంస్థ కార్యాలయంలోని డాక్టర్‌ ఎ.పి.జె అబ్దుల్‌ కలాం సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజలనుంచి వచ్చిన 41 అర్జీలను ఆయన స్వీకరించారు. అందుకున్న సమస్యలకు నిర్దిష్ట గడువులోపు నాణ్యమైన పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం అధికారులతో కమిషనర్‌ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా నూతన రోడ్ల నిర్మాణం, మంచినీటి సరఫరా, పార్కుల నిర్వహణ పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు.వర్షాకాలపు సమస్యలపై ప్రత్యేక దష్టి సారించి, నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు సక్రమంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.వర్షాలకు అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జిలలో, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పారుదల కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి నీటి ప్రవాహానికి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అదేవిధంగా టిడ్కో గహాలకు సంభందించి వస్తున్న అభ్యర్ధనలను విచారించి అర్హులందరికీ గహాలు కేటాయించాలన్నారు.స్పందన వేదికలో అందించే ఫిర్యాదుల సంఖ్యను తగ్గించేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు తమ విభాగాల పనితీరును మెరుగుపరిచేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. విభాగాల ఉన్నతాధికారులు వారంలో తమకు కేటాయించిన 4 సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించాలని, నోటీసు బోర్డుల ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందేలా పర్యవేక్షించాలన్నారు.స్పందన కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ సంజనా సింహా, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️