చించినాడలో సూర్యనారాయణ రాజు 18వ వర్ధంతి సభ

Jan 9,2024 16:39 #West Godavari District

ప్రజాశక్తి-బి.యలమంచిలి(పశ్చిమగోదావరి) : సిపిఎం సీనియర్‌ నాయకులు, చించినాడ గ్రామ మాజీ సర్పంచ్‌ రుద్రరాజు సూర్యనారాయణరాజు 18వ వర్ధంతి సభను మంగళవారం చించినాడలో నిర్వహించారు. ముందుగా సిపిఎం సీనియర్‌ నాయకులు కేతా సూర్యరావు జెండాను ఆవిష్కరించగా, సూర్యనారాయణ రాజు విగ్రహానికి మాజీ ఉప సర్పంచులు రుద్రరాజు సత్యనారాయణ రాజు (వైజాగ్‌ రాజు) రుద్రరాజు పెదబాబు, రైతు నాయకులు రుద్రరాజు చిన్న వర్మ , సూర్యనారాయణ రాజు మూడవ అల్లుడు కాశీ విశ్వనాథ రాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం మండల కార్యదర్శి కానేటి బాలరాజు అధ్యక్షత వహించగా సీనియర్‌ నాయకులు కేతా సూర్యరావు మాట్లాడుతూ.. చించినాడ గ్రామంలో సిపిఎం సుమారు 65 సంవత్సరాలు పాటు పంచాయతీలో అధికారంలో కొనసాగిందని, దీనిలో సుమారు 30 సంవత్సరాల పాటు సూర్యనారాయణ రాజు సర్పంచిగా, సుమారు 15 సంవత్సరాల పాటు సొసైటీ అధ్యక్షునిగా ప్రజలకు ఎనలేని సేవలు అందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అటువంటి నాయకుని అడుగుజాడల్లో ప్రతి కార్యకర్త నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దేవ సుధాకర్‌ ,సరిపల్లి జయప్రభ, తెన్నేటి సంపత రావు, ఎం ఆంజనేయులు, సిహెచ్‌ వడ్డీ కాసులు, గుబ్బల సత్యనారాయణ, గూడూరి ఆంజనేయులు, డివైఎఫ్‌ఐ నాయకులు టీ స్టాలిన్‌, విప్పర్తి నన్ని, తాడి ఉదరు, విప్పర్తి నాని, విప్పర్తి యెహౌషువ, పల్లేరు అనిల్‌, భారతుల రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️