19న ‘పుచ్చలపల్లి’ వర్ధంతి

సభప్రజాశక్తి – కడప అర్బన్‌ దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ ఈనెల 19 న ఉదయం 10 గంటలకు కడప పాత బస్టాండ్‌ లో ఉన్న సిపిఎం కార్యాలయంలో ఉంటుందని ఆ పార్టీ నగర కార్యదర్శి రామమోహన్‌, నగర కమిటీ సభ్యులు దస్తగిరిరెడ్డి, రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. గురువారం సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 1917, మే 1న జన్మించిన సుందరయ్య తన జీవితాన్ని పేదలకు, కష్టజీవులకు అంకితం చేశారన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సారధుల్లో సుంద రయ్య ఒకరిని పేర్కొన్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మిం చడంలో కీలకపాత్ర పోషించారన్నారు. చిన్న వయసులోనే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. క్రమశిక్షణ, త్యాగనిరతి, అధ్యయనం, ఆచరణ, నిర్మాణ దక్షత ఆయన సొంతమన్నారు. నేటి పరిస్థితుల్లో సుం దరయ్య స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు తప్పకుండా హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

➡️