239 లీటర్ల పురుగు మందులు సీజ్‌

Nov 19,2023 01:23 #palnadu district

 

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ : అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుండి తరలిస్తున్న పురుగు మందులను వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద పురుగు మందులు రవాణా చేస్తున్న ఆటోను సత్తెనపల్లి ఎడిఎ ఎస్‌.శ్రీధర్‌రెడ్డి శనివారం పట్టుకున్నారు. బేయర్‌ కంపెనీ, ఎఫ్‌ఎంసి కంపెనీ పురుగు మందుల వారి ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టారు. గుంటూరు నుండి సత్తెనపల్లి పట్టణంలోని శ్రీరామ ఫర్టిలైజర్‌ షాపునకు వస్తున్న పురుగు మందుల ఆటోను కంటిపూడి వద్ద ఆపి తనిఖీ చేయగా అనధికార నిల్వలను గుర్తించి సీజ్‌ చేశారు. బేయర్‌ కంపెనీకి చెందిన లాయిడ్స్‌ 80 పురుగు మందుల బాటిల్స్‌ ఎఫ్‌ఎంసి కంపెనీ చెందిన 230 లీటర్ల పురుగు మందులను సీజ్‌ చేశారు. వీటి విలువ రూ.3.20 వేలకుపైగా ఉంటుందని ఎడిఎ తెలిపారు. సీజ్‌ చేసిన పురుగు మందులు నుండి నాణ్యతా పరీక్షల నిమిత్తం ఒక్కొక్క బ్యాచ్‌ నుండి ఒకశ్యాపిల్‌ సేకరించి లాబ్‌కు పంపించినట్లు ఎడిఎ తెలిపారు.

➡️