27 నుండి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌

Jan 25,2024 00:25

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ రాజకుమారి
ప్రజాశక్తి-గుంటూరు :
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద లబ్ధిదారులకు అందించిన ఇంటి పట్టాలను జనవరి 27వ తేది నుండి రిజిస్ట్రేషన్లు చేపట్టాలని అధికారులకు జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి సూచించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా లబ్దిదారులకు అందించిన ఇంటి పట్టాలను గ్రామ, వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టేందుకు విఆర్‌ఓలు, పంచాయితీ సెక్రెటరీలు, డిజిటల్‌ అసిస్టెంట్లకు అవగాహన సదస్సును కలక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జెసితోపాటు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్వాతి, డీఆర్‌ఓ కే.చంద్రశేఖరరావు, గుంటూరు ఆర్డీఓ శ్రీఖర్‌, జిల్లా రిజిస్ట్రార్‌ జి.లక్ష్మీ వివరించారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సజావుగా చేపట్టాలని జెసి అన్నారు. సదస్సులో జిల్లా పంచాయితీ అధికారి కె.శ్రీదేవి, జిఎంసి సిటీ ప్లానర్‌ ప్రదీప్‌, సబ్‌ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

➡️