31వ రోజుకు అంగన్‌వాడీల సమ్మె

31వ రోజుకు అంగన్‌వాడీల

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీ వర్కర్స్‌ సమ్మె గురువారం 31వ రోజుకు చేరింది. వారికి పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. కాకినాడ అంగన్‌వాడీలకు మద్దతుగా ఆశ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం దగ్గర నుంచి అంగన్‌వాడీ సమ్మె శిబిరం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశాల సంఘం అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్స్‌ పట్ల ప్రభుత్వం మొండివైఖరి చాలా దారుణమన్నారు. సమ్మె 31వ రోజుకి చేరినా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా వ్యవహరి స్తోందన్నారు. పెరు గుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమంటే ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఉద్యోగాలు తీసేస్తామని బెదిరింపులకు దిగడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో మొగలి బేబీ, మలక నాగలక్ష్మి, చెక్కల వేణి,రత్న కుమారి, వరలక్ష్మి, బి.వరలక్ష్మి, సుగుణ, నవకుమారి పాల్గొన్నారు. కాజులూరు కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు సమ్మె శిబిరంలో మాట్లాడారు. సెక్టర్‌ లీడర్లు అన్నవరం, హనుమావతి, వరలక్ష్మి సునీత, భవాని, సలాది లక్ష్మి, నందికోళ్ల నాగమణి, శేషారత్నం రాయుడు సీత పాల్గొన్నారు. కరప సమ్మె శిబిరంలో అంగన్వాడీ ప్రాజెక్టు నాయకురాలు పి.వీరవేణి మాట్లాడారు. ఎస్‌.వరలక్ష్మి, ఎస్‌ఎస్‌.కుమారి, దైవ కుమారి, ఆశారత్నం, కల్పలత, సత్య మాధవి. ఎం.భవాని, నారాయణమ్మ, మంగతాయారు, సరోజిని, జ్యోతి, కల్పలత, పి.లక్ష్మి, ఎ.దేవి, బి.మనోజ, లక్ష్మి, సాయి దుర్గ, బి.భవాని పాల్గొన్నారు. పిఠాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద సమ్మె 31వ రోజు నేపథ్యంలో అంగన్‌వాడీలు 31వ సంఖ్య మాదిరిగా కూర్చుని నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు కె.చిన్న ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి డి తులసీదేవి మాట్లాడారు. నాయకులు విజయశాంత, నళిని, ప్రజావాణి, బేబీ, నాగగనిక, సత్యవతి, భవాని, గౌరి, వెంకటలక్ష్మి, అమల సూర్యకాంతం పాల్గొన్నారు. పెద్దాపురం మున్సిపల్‌ సెంటర్‌లో సమ్మె శిబిరం వద్ద యుటిఎఫ్‌ జిల్లా నాయకులు విజయగౌరి మాట్లాడారు. జెవివి రాష్ట్ర నాయకులు బి.అనంతరావు, సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమార్‌, ఎన్‌ సూరిబాబు, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు కేదారి నాగు అంగన్‌వాడీలకు మద్దతు తెలిపారు. దాడి బేబీ, నాగమణి, అమల, ఎస్తేరు రాణి, బాలం లక్ష్మి, టిఎల్‌.పద్మావతి, లోవ తల్లి, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, వన కుమారి, తులసి పాల్గొన్నారు. యు.కొత్తపల్లి ఒ.సత్యవతి, జి.బేబీరాణి, కె.అన్నపూర్ణ, హేమలత మాట్లాడారు. ఖోఖో ఆడి నిరసన తెలిపారు.

➡️