7న క్విజ్‌ పోటీలు

ప్రజాశక్తి-ఒంగోలు : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని ప్రభుత్వ వైద్యకళాలలో ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేషన్‌ మరియు ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సోషల్‌ ప్రివెంటివ్‌ మెడిషన్‌ ఆంధ్రప్రదేశ్‌ చాపర్ట్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో క్విజ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర నోడల్‌ అధికారి డాక్టర్‌ బి. తిరుమలరావు తెలిపారు. క్విజ్‌ పోటీల్లో భాగంగా ఏప్రిల్‌ 3న ప్రిలిమనరి, 7న ఫైనల్‌ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో కమ్యూనిటీ మెడిసిన్‌ చదివే పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులు ఈ పోటీల్లో పొల్గొన వచ్చునని ఆయన తెలిపారు. ప్రతి కళాశాల నుంచి 8 మందితో కూడిన టీం పోటీల్లో పాల్గొన వచ్చునని తెలిపారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.9 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.6 వేలు, తృతీయ బహుమతిగా రూ.3 వేల నగదు బహుమతి ఐపిహెచ్‌ఎ రాష్ట్ర ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అప్పలనాయుడు, ఐఎపిఎస్‌ఎం రాష్ట్ర ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సూర్యప్రభ చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్విజ్‌ పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యకళాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఏడు కొండలరావు, ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి. శ్రీదేవి, రాష్ట్ర నోడల్‌ అధికారి,అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ తిరుమలరావు, డాక్టర్‌ భాస్కరి, డాక్టర్‌ రాధిక, డాక్టర్‌ దివ్య, డాక్టర్‌ స్పందన, డాక్టర్‌ ప్రదీప్‌, డాక్టర్‌ జానెట్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️