బైక్‌ను ఢీకొట్టిన కారు – ఒకరు మృతి

Apr 5,2024 10:17 #bike, #car collided, #one person died

అనంతపురం : బైక్‌ను కారు డీకొట్టడంతో దంపతులకు తీవ్రగాయాలై ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం అనంతపురంలోని కూడేరు అనంత వెంకటరామిరెడ్డి కాలనీ చెక్‌ పోస్ట్‌ దగ్గర జరిగింది. కారులో ఉన్నవారు ఘటనా స్థలం వద్దనే కారును వదిలి పరారయ్యారు. బైక్‌పై ఉన్న కలగళ్ల జగన్నాథ రెడ్డి అక్కడికక్కడే మరణించారు. అతడి భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️