ఉప్పుటేరులోకి దూకి వివాహిత ఆత్మహత్య

May 21,2024 10:04 #Kakinada, #Suicide, #woman

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ఉప్పుటేరులోకి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం యు.కొత్తపల్లిలో జరిగింది. అమరవిల్లి గ్రామానికి చెందిన బోరా దుర్గ (38) ఈరోజు గ్రామ శివారులో ఉన్న ఉప్పుటేరు లో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం… దుర్గకు కొన్ని ఏళ్లుగా ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు చెప్పారు. కొన్ని రోజుల క్రితం అక్రమ సంబంధిత దారుడితో గొడవలు పడిందని, అతడు ఆమె తలపై కొట్టాడని తెలుస్తుంది. దుర్గకు భర్త, పిల్లలు కూడా ఉన్నారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకుంటున్నారు.

➡️