రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Jun 15,2024 16:23 #chittore, #person died, #road accident

ప్రజాశక్తి-వి.కోట (చిత్తూరు) : మండల పరిధిలోని దాసార్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు …. రామకుప్పం కు చెందిన అబ్దుల్‌ రోఫ్‌ (30) మెకానిక్‌ గా జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు ఉదయం వ్యక్తిగత పనులపై వీకోట వైపు బైక్‌ పై వస్తుండగా దాసార్లపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు సిలిండర్ల లారీ, బైక్‌ను ఢకొీట్టింది. ఈ సంఘటనలో అబ్దుల్‌ రోప్‌ తలకు బలమైన రక్త గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వీకోట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ ని క్రమబద్ధీకరించారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ లింగప్ప తెలిపారు.

➡️