ఏనుగు దాడిలో కడుపుతో ఉన్న పాడి ఆవు మృతి

ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : ఏనుగు దాడిలో కడుపుతో ఉన్న పాడిఆవు మృతి చెందిన ఘటన శుక్రవారం అర్థరాత్రి సోమల మండలంలో జరిగింది. సోమల మండలం అన్నెమ్మగారిపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ అనే రైతుకు చెందిన పాడి ఆవు పొలం వద్ద కట్టబడి ఉండగా శుక్రవారం అర్ధరాత్రి ఒంటరి ఏనుగు షెడ్డు వద్దకు వచ్చి అలజడి సఅష్టించి గర్భం దాల్చి ఉన్న పాడి ఆవును చంపేసిందని రైతు తెలిపారు. పొలం వద్దనే ఆవుల కోసం షెడ్డు వేసి వాటిలో ఆవులను కడతామని రైతు చెప్పారు. యధా ప్రకారం నిన్న రాత్రి ఆరు ఆవులను షెడ్డులో కట్టి పక్కనే ఇటుకలు కోసే ప్రాంతంలో నిద్రించామని అర్ధరాత్రి వేళ ఆవుల అరుపులు వినిపించాయని అదే సమయంలో ఏనుగు ఘీంకారం కూడా వినిపించడంతో ఆవుల వద్దకు వెళ్లలేకపోయామని అన్నారు. శనివారం ఉదయం ఆవుల షెడ్డు వద్దకు వెళ్లి చూడగా ఒక ఆవు మఅతి చెంది ఉందని రెండు ఆవులు తాడు తెంపుకొని పారిపోయాయని గమనించినట్లు రైతు తెలిపారు. మఅతి చెందిన ఆవు గర్భం దాల్చి ఉందని లక్ష రూపాయలు విలువ చేస్తుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని ప్రజాశక్తికి గోడు వెళ్లబోసుకున్నారు. సంఘటన జరిగిన విషయాన్ని అటవీ శాఖకు పశువైద్య సిబ్బందికి తెలియజేసినట్లు రైతు తెలిపారు. సర్పంచ్‌ వనజమ్మ, నాయకులు రమణారెడ్డి పలువురు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

➡️