రైలు కిందపడి ప్రైవేట్‌ లెక్చరర్‌ ఆత్మహత్య

Feb 23,2024 14:12 #private lecturer, #Suicide, #train

తిరుపతి : రైలు కిందపడి ప్రైవేట్‌ లెక్చరర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం తిరుపతి -చంద్రగిరి రైలు మార్గంలోని 94/ 21 -23 పోస్టుల మధ్య జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు నారాయణ కళాశాల లో ఫిజిక్స్‌ లెక్చరర్‌ గా పనిచేస్తున్న సంతోష్‌ శ్రీరాం (28)గా గుర్తించారు. వెదురుకుప్పం మండలం బలిజపల్లికి చెందిన సంతోష్‌ శ్రీరాం బైరాగి పట్టెడలో నివాసం ఉంటూ నారాయణ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల వల్ల మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వెల్లడించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగిస్తామని పాకాల రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️