టిడిపి-జనసేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రజాశక్తి-బి.కొత్తకోట(అన్నమయ్య) : తంబళ్లపల్లె నియోజకవర్గం, బి.కొత్తకోట నుండి పిటిఎం, ములకలచెరువు, తంబళ్లపల్లి, కురబలకోట మండలాల మీదుగా జనసేన – టిడిపి నాయకులు, కార్యకర్తలు శనివారం నిరసన ర్యాలీ చేపట్టారు. తంబళ్లపల్లి జనసేన – టిడిపి ఉమ్మడి అభ్యర్థిని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ప్రకటించిన తర్వాత చంద్రబాబు నివాసం ముందు తంబళ్లపల్లి నియోజకవర్గం టిడిపి – జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా త్వరలో పున్ణసమీక్షించి అభ్యర్థిని సర్వేల ఆధారంగా ప్రకటిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ప్రకటన ఆలస్యం కావడంతో అందుకు నిరసనగా బి.కొత్తకోట కొండ ఎస్టేట్‌ నుండి కొండ నరేంద్ర అభిమానులు ఈ మౌన నిరసన ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్దఎత్తున జనసేన – టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️