ముస్లిం స్మశాన వాటికకు నిధులు మంజూరు చేయాలని వినతి

Nov 26,2023 16:27 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య) : జి.ఎం.సి కల్యాణ మండపంలో చిత్ర కళా ప్రదర్శన సందర్శనార్థం విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషకు రాష్ట్ర వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జాహిద్‌ అలీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలు వినతి పత్రం అందజేశారు. మండల పరిధిలోని కారంపల్లి పంచాయతీలో ముస్లింలకు ప్రభుత్వం ద్వారా నూతనంగా మంజూరు చేసిన ముస్లిం స్మశాన వాటికకు నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్‌ సభ్యులు గౌస్‌, కౌన్సిలర్‌ న్యామతుల్లా, పట్టణ మైనారిటీ అధ్యక్షులు మసూద్‌ అలీ, మున్నా తదితరులు పాల్గొన్నారు.

➡️