క్రైస్తవ సంఘం సభ్యులతో ఆత్మీయ సమావేశం

సమావేశంలో మాట్లాడుతున్న జియ్యాని శ్రీధర్‌

ప్రజాశక్తి-వేపగుంట : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆడారి ఆనంద్‌కుమార్‌, విశాఖ ఎంపీ అభ్యర్ధి బొత్స ఝాన్సీలను గెలిపించాలని కోరుతూ 52వ వార్డులో డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ ప్రచారం నిర్వహించారు. క్రైస్తవ సోదరులు, ఎన్‌ఎడి, యుసిసి సంఘం సభ్యులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు. ఆడారి ఆనంద్‌కుమార్‌ సోదరి పీలా రమాకుమారి ముఖ్య అతిథిగా హాజరై నియోజకవర్గంలో 18 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఆనంద్‌కుమార్‌కు మద్దతుగా క్రైస్తవ సోదరులు నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బిఎస్‌.కృష్ణ, జియ్యాని మారుతి పాల్గొన్నారు.బైక్‌ ర్యాలీని జయప్రదం చేయండి ప్రజాశక్తి -గోపాలపట్నం : జివిఎంసి 91, 92వ వార్డుల పరిధిలో మంగళవారం నిర్వహించే బైక్‌ ర్యాలీని జయప్రదం చేయాలని వైసిపి నాయకులు బెహరా భాస్కరరావు పిలుపునిచ్చారు. మేఘాద్రిగెడ్డ శ్రీ ఆంజనేయ స్వామి గుడి నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. 91, 92 వార్డుల కార్యకర్తల సమావేశం సోమవారం బెహరా భాస్కరరావు ఇంటిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ర్యాలీలో వైసిపి శ్రేణులతంతా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గునిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు వైసిపి అధ్యక్షులు గొర్లె అప్పలస్వామినాయుడు, గేదెల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️