తాత్కాలిక కోర్టు భవనాన్ని సిద్ధం చేయించాలి

Apr 11,2024 21:25

ప్రజాశక్తి- శృంగవరపుకోట : ఎస్‌కోటలో తాత్కాలిక అద్దె ప్రాతిపదికన తీసుకున్న భవనంలో కోర్టుకు అవసరమైన విధంగా భవనాన్ని సిద్ధం చేయించాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి కుమారి సబ్బవరపు వాణి న్యాయవాదులకు సూచించారు. ఎస్‌.కోట బార్‌ అసోసియేషన్‌కు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శి జి.సూరిదేముడు, బి.సత్యనారాయణ ఆధ్వర్యంలో న్యాయవాదులతో తాత్కాలిక కోర్టు నిర్మాణ పనులపై ఆమె గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌.కోటలో ప్రస్తుతం నిర్వహిస్తున్న కోర్టు భవనం శిథిలావస్థకు చేరినందున అద్దె భవనంలోకి మారేందుకు గాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి పంపిన నివేదిక మేరకు హైకోర్టు ఉత్తర్వులు మంజూరు చేశారని వెల్లడించారు. ఇదే విషయాన్ని సంబంధిత తాత్కాలిక అద్దె భవనం యజమానికి తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేయించాలని భవన యజమానిని ఆదేశించారు. అనంతరం జూనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయవాదులు ఎస్‌.కోట పట్టణంలోని అలంకార్‌ థియేటర్‌ సమీపంలో అద్దె ప్రాతిపదికన తీసుకున్న సాయికృష్ణ కళ్యాణ మండపం భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జి.సూరిదేముడు, కార్యదర్శి బి.సత్యనారాయణ, సీనియర్‌ న్యాయవాదులు అల్లు సత్యాజీ, టిటివి రమానాజీ, గేదెల ప్రకాష్‌, ఎం.దొరబాబు, బి.త్రిమూర్తులు, డబ్ల్యు.ఎన్‌.శర్మ, వారాది ఈశ్వరరావు, టివిఆర్‌ మూర్తి, బివిఎస్‌ రామారావు, ఆర్‌.సత్యనారాయణ, జి.చిట్టిబాబు, బొడబళ్ల రామకృష్ణ, ఎం.అప్పారావు, ఎల్‌.అప్పారావు, బొడ్డు వెంకటరావు, బొబ్బిలి రామకృష్ణ, కోర్టు సూపరింటెండెంట్‌ సంపత్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️