గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

Jun 14,2024 15:04 #chittore, #road accident, #woman died

ప్రజాశక్తి – ఎస్‌ఆర్‌ పురం (చిత్తూరు) : గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని గంగమ్మ గుడి వద్ద చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు …. గంగమ్మ గుడి కి చెందిన సావిత్రి (65) శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళుతుండగా, చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారి గంగమ్మ గుడి మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఎస్సై రాజు కుల్లాయప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

➡️