ఎద్దుల బండి తగిలి మహిళా కూలి మృతి

Apr 9,2024 08:05 #accident, #died, #Laborer, #woman

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : కూలి పనుల కోసం ఆటోలో వెళుతుండగా, ఎద్దులబండి ఢకొీట్టడంతో తీవ్రగాయాలపాలై మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు, తోటి కూలీలు తెలిపిన వివరాల ప్రకారం … వేటపాలెం మండలం కొణిజేటి చేనేతపురి కాలనీకి చెందిన ఎస్‌ కె మస్తాని అనే మహిళ కూలి పనుల కోసం ఆటోలో ప్రయాణిస్తుంది. ఆటోలోని కడ్డీపై కూర్చుంది. హైవేలోని గాయత్రి రెస్టారెంట్‌ సమీపంలో ఆటోలో వెళుతున్న మస్తానికు ఎదురుగా వస్తున్న ఎద్దుల బండి తగిలింది. ఎద్దుల బండి ముందున్న రేకు మహిళ కడుపులో పొడుచుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే ఆపస్మారక స్థితిలో చేరుకున్న ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తుండగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఔట్‌ పోస్టు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️