హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

Jun 20,2024 19:51

 ప్రజాశక్తి-విజయనగరం కోట :  డెంకాడ పోలీసు స్టేషను పరిధిలో 2020లో నమోదైన హత్య కేసులో నిందితుడు బొల్లు వెంకటరావుకు యావజ్జీవ కారాగార శిక్ష , రూ. 2వేలు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈనెల 19న తీర్పు వెల్లడించినట్లు ఎస్‌పి ఎం.దీపిక తెలిపారు. 2020 డిసెంబర్‌ 14న డెంకాడ మండలం సింగవరం గ్రామానికి చెందిన బావన సురేష్‌ను బావ అయిన బొల్లు వెంకటరావు కుటుంబ తగాదాల నేపథ్యంలో గ్యాస్‌ సిలిండరుతో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలై విశాఖ కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి అమ్మమ్మ బొల్లు అమ్మాజీ డెంకాడ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడంతో డెంకాడ పోలీసు స్టేషను అప్పటి ఎస్‌ఐ సాగర్‌ బాబు కేసు నమోదు చేయగా, అప్పటి భోగాపురం సిఐ సిహెచ్‌.శ్రీధర్‌ కేసులో దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో వెంకటరావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.కళ్యాణ చక్రవర్తి తీర్పు వెల్లడించారు.

➡️