జెఈఈ మెయిన్స్‌లో అడపా తరుణ్‌ వెంకట లోకేష్‌ ప్రతిభ

ప్రజాశక్తి-రామచంద్రపురం(అంబేద్కర్ కోనసీమ): కె. గంగవరం మండలం సుందరపల్లి గ్రామానికి చెందిన అడపా తరుణ్‌ వెంకట లోకేష్‌ జేఈఈ మెయిన్‌ పరీక్షలో ప్రతిభ కనబర్చాడు. మాజీ సహకార సంఘం అధ్యక్షుడు అడపా నారాయణ స్వామి, మాజీ సుందరపల్లి సర్పంచ్‌ అడపా పద్మ సూర్య రామలక్ష్మి దేవి దంపతుల కుమారుడైన వెంకట లోకేష్‌ జేఈఈ మెయిన్స్‌ పరీక్షలో 99.36 శాతం స్కోర్‌ సాధించాడు. జాతీయ స్థాయిలో ప్రసిద్ధమైన ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు దక్కే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థి వెంకటలోకేష్‌కి పలువురు అభినందనలు తెలిపారు.

➡️