లైసెన్స్‌ ఉన్న విత్తనాలన్నీ మంచివే : ఎడిఎ

May 24,2024 22:57

విత్తన దుకాణాల్లో రికార్డులను పరిశీలిస్తున్న ఎడిఎ
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
రైతులు సాగుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వారికవసరమైన విత్తనాల నిల్వలను అందరికీ సరిపడే మోతాదులో అందుబాటులోకి రానున్నాయని నరసరా వుపేట డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఎడి ఎ) పి.మస్తానమ్మ తెలిపారు. బుధ, గురువారాల్లో నరస రావుపేట పట్టణంలోని పలు విత్తన దుకాణాల్లో చేపట్టిన తనికీలు శుక్రవారమూ కొనసాగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న పంట లకు సంబంధించిన విత్తన ప్యాకెట్లను బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పత్తి విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు లోబడి మాత్రమే విక్రయించాలని వ్యాపారులను ఆదేశించారు. రైతులు ఒకే రకం విత్తనాలు అడుగుతున్నారనే కారణంతో ఆ విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక కంపెనీకి చెందిన విత్తనాలు మాత్రమే కావాలని పట్టు పట్టడం కూడా రైతులకు శ్రేయస్కరం కాదన్నారు. దీనివల్ల మార్కెట్లో ఆ బ్రాండ్‌ను కృత్రిమ కొరత ఏర్పడుతుందని అన్నారు. వ్యవసాయ శాఖ లైసెన్సు పొందిన డీలర్ల వద్ద లభించే అన్ని రకాల విత్తనాలు నాణ్యమైనవే ఉంటాయని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసిన సందర్భంలో రసీదును తప్పనిసరిగా పొందాలని, వాటిని పంటకాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా దాచుకోవాలని రైతులకు సూచించారు.గ్లైసిల్‌ బిటి పత్తి విత్తనాలు విక్రయాలు నిషేధంప్రభుత్వం నిషేధించిన గ్లైసిల్‌ బిటి పత్తి విత్తనాలు నిల్వలు కలిగి ఉన్నా, సాగు చేసినా రైతులపై సైతం చర్యలు తీసుకుంటామని ఎడిఎ స్పష్టం చేశారు. గ్లైసిల్‌ బిటి పత్తి సాగు వల్ల భూమి, పర్యావరణం కలుషితమవుతున్నాయని, ప్రజారోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పారు.

➡️