మేమంతా సిద్ధం సభను జయప్రదం చేయాలి

ప్రజాశక్తి-దర్శి : ఈనెల 7న నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభను జయప్రదం చేయాలని వైసిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి  డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. స్థానిక కార్యాలయంలో వైసిపి నాయకులు, కార్య కర్తలతో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 7న కొనకనమిట్ల మండలం మార్కాపురం అడ్డరోడ్డు వద్ద సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ సభకు దర్శి నియోజకవర్గంలో నుంచి భారీగా తరలిరావాలన్నారు. అదేవిధంగా కురిచేడులోని వైసిపి కార్యాలయంలోనూ వైసిపి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని సిద్ధం సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర కార్పోరేషన్‌ డైరెక్టర్లు కుమ్మిత నాగిరెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి, మాజీ ఎంపిపి ఇత్తడి దేవదానం, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాంభూపాల్‌ రెడ్డి, దేవర ప్రసాదు, చింతలపూడి శ్రీనివాస్‌ రెడ్డి, కురిచేడు జడ్‌పిటిసి నాగిరెడ్డి, మాజీ ఎంపిపి సుబ్బారెడ్డి, పిచ్చి రెడ్డి, వీరగంధం కోటయ్య, రాష్ట్ర సాంస్కతిక విభాగా డైరెక్టర్‌ షేక్‌ సైదా సర్పంచి కాసు భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️