అల్లూరి స్పూర్తితో ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఉద్యమం

రాజవొమ్మంగిలో నివాళులర్పిస్తున్న సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు

ఘనంగా అల్లూరి శత వర్థంతి

ప్రజాశక్తి-రాజవొమ్మంగి

ఏజెన్సీలో అటవీ హక్కులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి కోసం పోరాడిన తొలితరం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఆయన స్పూర్తితో ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా మంగళవారం రాజవొమ్మంగి అల్లూరి సెంటర్‌ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సిఐటియు మండల కన్వీనర్‌ పి.రామరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆ సంఘం నాయకులు పలివెల వీరబాబు మాట్లాడుతూ బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు మరణించి 100 సంవత్సరాలైనా నేటికీ ఆయన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కోండ్ల సూరిబాబు, కుంజం జగన్నాధం, సింగిరెడ్డి అచ్చారావు, రామశేషు, గ్రామ పెద్దలు డి శివాజీ, సూరిబాబు, గుత్తా, ప్రజాసంఘాల నాయకులు టి శ్రీను, వెంకటలక్ష్మి, కుమారి తదితరులు పాల్గొన్నారు.మోతుగూడెం : చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో అల్లూరి శత వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అల్లూరి స్ఫూర్తితో అటవీ సంపద రక్షణకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కేతా గోపాలన్‌, కె.క్రాంతిబాబు, చింతా రాంబాబు, బత్తుల విజరు కుమార్‌, కింతాడ రమేష్‌, కేతా పద్మ, తూటే సురేష్‌, ఇంజేటి శ్రీనివాస్‌, కేతా ప్రమోద్‌ పాల్గొన్నారు.కూనవరం : మండలంలోని టేకులబోరులో సీపీఎం నాయకులు అలూరి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు తాళ్లూరి శ్రీనివాస్‌, పాయం సీతారామయ్య, మేకల నాగేశ్వరరావు, ఐ.వెంకటేశ్వర్లు, ఎపి ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మడివి రవితేజ, ఇల్లెందు నాయకులు కృష్ణ, ప్రజా నాట్య మండలి కళాకారులు కన్నారావు, పద్దం రాజు, వినోద్‌, బన్ను పండు పాల్గొన్నారు.వై.రామవరం : స్థానిక మెయిన్‌ రోడ్‌లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు మాట్లాడుతూ శాంతిరాజు, రామకృష్ణ మాట్లాడుతూ అల్లూరి ఆశయాలు నెరవేరడంలో పాలకులు విప్లమయ్యారని, ఆదివాసీలకు విద్య వైద్యం, మౌలిక వసతులు అందని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సత్యనారాయణ, ప్రసాద్‌, వెంకన్న, నాగేంద్ర, ఆంజనేయులు, దుర్గ పాల్గొన్నారు. డుంబ్రిగుడ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని స్థానిక అల్లూరి యూత్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అల్లూరి విగ్రహానికి నివాళులు అర్పించారు అనంతరం ఆ సంఘం మండల అధ్యక్షుడు కే.సూర్యప్రకాష్‌ మాట్లాడుతూ, అల్లూరి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నవసూర్య, కె.ప్రవీణ్‌, సురేంద్ర, అల్లూరి యూత్‌ సభ్యులు పాల్గొన్నారు. చింతపల్లి : మన్య ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు చేసిన కృషి ఎనలేనిదని స్థానిక ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు దేశెట్టి సత్యనారాయణ (సతీష్‌) అన్నారు. బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు శత వర్ధంతిని పురస్కరించుకుని సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్ధంతి కార్యక్రమంలో తోటి పాత్రికేయ మిత్రులతో కలిసి అల్లూరి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లూరి పోరాట స్ఫూర్తి మన్యవాసులలో ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. కార్యక్రమంలో పాత్రికేయులు సబితి, వనరాజు, ఉప్పలపాటి బంగారయ్య శెట్టి, సంకు రవి, చోడిశెట్టి శ్రీనివాసరావు, జి.నాగేశ్వరరావు, పేయ్యల శ్రీనివాసరావు, షేక్‌ ఖాసిం వల్లి పాల్గొన్నారు.

➡️