అంగన్వాడీల సమ్మె ఉధృతం

ప్రజాశక్తి -యంత్రాంగం:అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం అంగన్‌వాడీల సమ్మె ఉధృతంగా సాగింది. అధికారులు అంగన్‌వాడీ కేంద్రాలను తెరిచేందుకు ప్రయత్నం చేయగా సిపిఎం, ప్రజా సంఘాల నేతలతో కలిసి అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. పాడేరు: తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న విధానం సరి కాదని సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్‌ ధ్వజమెత్తారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం మొదటి నుంచి మొండి వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మూడవరోజు గురువారం కొనసాగింది. పాడేరులోని అంగన్వాడీల నిరసన దీక్ష శిబిరాన్ని చిన్నయ్య పడాల్‌ సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీలకు నిర్బంధాలు కొత్త కాదని జగన్మోహన్‌ రెడ్డి రాజకీయ జీవితం పది సంవత్సరాలైతే, అంగన్వాడీల ఉద్యోగ జీవితం 50 సంవత్సరాలన్నారు. కొన్నాళ్లుగా చర్చల పేరుతో పేరుతో కాలయాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బరితెగించి అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి సమ్మె చేస్తుంటే కనీసం అక్కా చెల్లెమ్మలు తోబుట్టువులు గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించి సమ్మె విరమింప చేసేటట్టు ప్రయత్నం చేయాలన్నారు. పాడేరు ఐసిడిఎస్‌ పరిధిలో భీమసింగి నడిం వీధి లగసపల్లి జామ గూడ బరిసింది బంగారమెట్ట చింతల వీధి అంగన్వాడీ సెంటర్లలో తాళాలు పగలగొట్టించారని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగుల్లి భాగ్యలక్ష్మి, చిన్నారి, విజయ కుమారి, లక్ష్మి, విజయ, భాగ్య పాల్గొన్నారు. పాడేరులో అంగన్వాడీల దీక్ష శిబిరాన్ని జనసేన అరకు పార్లమెంట్‌ ఇంచార్జి వంపురి.గంగులయ్య సందర్శించి ఆందోళనకు మద్దతు ప్రకటించారు.అరకులోయ రూరల్‌: వేతనాలు పెంచుతామని పాదయాత్రలో జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వీ.ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. అరకు వేలి మండలంలో అంగన్వాడి సెంటర్‌ తాళాలు పగల గొట్టడానికి వచ్చిన ఎంపీడీఓ, పంచాయితీ అధికారులను నిలదీసి అడ్డుకున్నారు. దీంతో గత్యంతరం లేక అధికారులు వెనుతిరిగారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు రూ.26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, విధుల్లో ఉండి చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు డి.నాగమ్మ, ప్రాజెక్టు కమిటీ నాయకులు పాంగి వెంకటలక్ష్మి, లక్ష్మి, నిర్మల, జానకి, భవాని, సీత, గౌరమ్మ, వంజన తదితరులు పాల్గొన్నారు.డుంబ్రిగుడ: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీ కార్మికులు చేపడుతున్న సమ్మే గురువారం మూడో రోజుకు చేరుకుంది. మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంకు సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని టెంటును ఏర్పాటు చేసి అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై వంటవార్పు చేసి తమ నిరసనను తెలియజేశారు. యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరావు మాట్లాడుతూ, అంగ్వాడీ కార్యకర్తల సమస్యలు తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు. అంగన్వాడీ కార్యకర్తల సంఘం మండల అధ్యక్షురాలు కొండమ్మ, కార్యదర్శి సత్యావతి, యూటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి బాలక్రిష్ణ, కార్మికులు పాల్గొన్నారు.ముంచింగిపుట్టు:మండలంలోని సుజనకోట, కిలగడ అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టేందుకు వచ్చిన ఎంపిడిఒ, సిడిపిఒ సూపర్‌వైజర్‌, సచివాలయ సిబ్బందిని సిపిఎం నేతలు అడ్డుకున్నారు. ఎంపీడీవోతో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కొర్ర త్రినాథ్‌ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా త్రినాథ్‌ మాట్లాడుతూ, అంగన్వాడీలతో వెట్టి చాకిరి చేయిస్తున్నారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి ఇప్పటికైనా విడనాడాలన్నారు.గిరిజన సంఘం మండల అధ్యక్షులు ఎమ్మెస్‌ శ్రీను, సిఐటి మండల కార్యదర్శి కొర్ర శంకర్రావు పాల్గొన్నారు.అనంతగిరి:అంగన్వాడీలపై ప్రభుత్వం బెదిరింపు చర్యలకు మానుకోవాలని, న్యాయపరమైన డిమ్మెండ్లను పరిష్కరించాలని స్థానిక జెడ్పిటిసి దీసరి గంగరాజు సూచించారు. మూడవ రోజుకు చేరుకున్న సమ్మెలో పాల్గొని మద్దతు ప్రకటించారు. మండల కేంద్రంలో అంగన్వాడి టును ఐసిడిఎస్‌ ప్రాజెక్టు సిడిపిఓ సంతోషి కుమారి, సిబ్బంది, వెలుగు ప్రాజెక్ట్‌, సచివాలయం సిబ్బందిలు సందర్శించి తాళాలు పగలగొట్టి ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడనుండి వెను తిరిగారు మండల సిఐటి కార్యదర్శి కె, మొస్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎస్‌, నాగులు వెలుగు విఒఎల సంఘ నాయకురాలు, రంజీత, దిలీప్‌, అంగన్వాడి యూనియన్‌ మండల నాయకురాలు మంజుల ,కళావతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారుపెదబయలు:అంబేద్కర్‌ కూడలి జంక్షన్‌ వద్ద అంగన్వాడీ హెల్పర్స్‌ మోకాళ్ళపై నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేఖంగా నినాదాలు చేసారు. అంగన్వాడీ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు టి.రాజమ్మ, నాయకులు మంగ, పద్మ, సుశీల, కొండమ్మ పాల్గొన్నారు.హుకుంపేట: మండల కేంద్రంలోనీ ఐసీడీఎస్‌ కార్యాలయం నుండి ప్రభుత్వ పాఠశాల వరకు అంగన్‌వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలిలో మానవ హారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు టి.కృష్ణారావు, కే.రామారావు, అంగన్వాడీ యూనియన్‌ మండల నాయకులు అప్పలకొండమ్మ, కృష్ణవేణి, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రామారావు, పాల్గొన్నారు.చింతూరు : చింతూరు ఐటిడిఎ ఎదుట అంగన్వాడీల మూడో రోజు ధర్నాను సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పూనెం సత్యనారాయణ ప్రారంభించారు. వీరి ఆందోళనకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్‌, కూనవరం వైస్‌ ఎంపీపీ కొమరం పెంటయ్య సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పొడియం లక్ష్మణ్‌. అంగన్వాడీలు జయ, కామేశ్వరి, దుర్గ, నూకరత్నం పాల్గొన్నారు.మారేడుమిల్లి : స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె దీక్షకు ఎపి ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లి రెడ్డి, టిడిపి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గొర్లె సునీత, మండల మాజీ అధ్యక్షులు బీశెట్టి అప్పాజీ సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.రాజవొమ్మంగి : రాజవొమ్మంగి ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం ఎదురుగా అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన మూడో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ధర్నా శిబిరంలో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు, డివైఎఫ్‌ఐ మండల అధ్యక్షులు టి శ్రీను మద్దతు తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కె వెంకటలక్ష్మి, చిన్ని కుమారి, రమణి, సుందరమ్మ, సత్యవతి, రాజేశ్వరి, మంగ పాల్గొన్నారు.అడ్డతీగల : స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో అంగన్వాడీలు చేపట్టిన నిరసన కార్యక్రమం మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్షురాలు బేబీ రాణి, సిఐటియు డివిజన్‌ నాయకురాలు బి నిర్మల, అడ్డతీగల, రాయపల్లి, చెవిటి దిబ్బలు పాల్గొన్నారు.విఆర్‌.పురం : అంగన్వాడీలు సమ్మెలో భాగంగా మండలంలోని రేఖపల్లి రెవెన్యూ కార్యాలయం వద్ద మూడో రోజు దీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పూనెం సత్యనారయణ, యూనియన్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు ముసురు రాజేశ్వరి, సున్నం రంగమ్మ పాల్గొన్నారు.కూనవరం : అంగన్వాడీల మూడో రోజు సమ్మె సందర్భంగా బస్టాండ్‌ సెంటర్లో వంటా వార్పు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. వారి ఆందోళనకు సిపిఎం, యుటిఎఫ్‌ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కొమరం పెంటయ్య, సీపీఎం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, నాయకులు తాళ్లూరి శ్రీనివాసరావు, యుటిఎఫ్‌ నాయకులు అనిగే నాగేశ్వరరావు, కన్నారావు పాల్గొన్నారు.కొయ్యూరు : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపడుతున్న సమ్మె మూడవ రోజుకి చేరింది. ఈ సందర్భంగా శిబిరం వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. వీరి ఆందోళనకు వెలుగు సిబ్బంది మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎస్‌ సూరిబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై.అప్పలనాయుడు పాల్గొన్నారు.సీలేరు : అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన ఆందోళన కార్యక్రమం జీకే వీధి మండల కేంద్రంలో మూడో రోజు చేరుకుంది. ఈ సందర్భంగా వంటా వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జీకే వీధి ఎంపీడీవో ఉమామహేశ్వరరావుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గడుతూరు సత్యనారాయణ పాల్గొన్నారు.రంపచోడవరం : రంపచోడవరం తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మూడవ రోజుకి చేరింది. సమ్మెలో భాగంగా తహసిల్దార్‌ కార్యాలయం నుండి అంబేద్కర్‌ కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ మానవహారం నిర్వహించారు. వీరి ఆందోళనకు సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మట్ల వాణిశ్రీ, పల్లపు వెంకట్‌, యుటిఎఫ్‌ నాయకులు వెంగళరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు నాయకులు కారం రామలక్ష్మి, మంగమ్మ, చిట్టెమ్మలు, సింగారమ్మ, సత్యవేణి పాల్గొన్నారు.అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టిన అధికారులుఅడ్డుకున్న అంగన్వాడీలుప్రజాశక్తి-రాజవొమ్మంగి:అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ వర్కర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో రాజవొమ్మంగి అంగన్వాడీ కేంద్రం-2 తాళాలను స్థానిక సిడిపిఓ దేవమణి, సూపర్వైజర్లు, సచివాలయ సిబ్బంది, మహిళా పోలీస్‌ తదితరులు బద్దలగొట్టి లోపలకు ప్రవేశించారు. విషయం తెలుసుకున్న అంగన్వాడీలు, గిరిజన సంఘం, సిఐటియు, డివైఎఫ్‌ఐ నాయకులు అక్కడికి చేరుకొని అధికారులను అడ్డుకున్నారు. తమ సమస్యలపై ఆందోళన చేస్తుంటే పరిష్కరించకపోగా, ఈ విధంగా వ్యవహరించడం తగదని నాయకులు పేర్కొన్నారు. కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం కేంద్రాలను తెరిసి లబ్ధిదారులకు పౌష్టికాహారం ఇవ్వాలని స్థానిక ఎంపీడీవో లోకుల యాదగిరిశ్వరరావు అంగన్వాడీలకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను తీయడానికి వీలులేదని అడ్డుకోవడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరుగారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, సిఐటియు, డివైఎఫ్‌ఐ నాయకులు పి రామరాజు, టి శ్రీను, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు వెంకటలక్ష్మి, చిన్ని కుమారి, రమణి, రాజేశ్వరి, సత్యవతి పాల్గొన్నారు.

➡️