అంబేద్కర్‌కు వినతులు

Jan 20,2024 00:05
కూనవరంలో అంబేద్కర్‌కు నివాళి అర్పిస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి- విలేకర్ల బృందంసమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు శుక్రవారం సమ్మెను కొనసాగించారు. విజయవాడలో సిఎం జగన్‌ అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా జిల్లాలో అంగన్‌వాడీలు నిరసనలు చేపట్టారు. సిఎంకు మంచి బుద్దిని ప్రసాదించాలని అంబేద్కర్‌ విగ్రహాలకు వినతులు సమర్పించారు. డుంబ్రిగుడ: మండలంలో అంగన్వాడీ కార్మికులు సమ్మెను కొనసాగించారు. శుక్రవారం మండల కేంద్రంలోని హైవే రోడ్డు యూనియన్‌ బ్యాంక్‌ జంక్షన్‌ వద్ద ఆందోళన చేపట్టి అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పిస్తూ తమ నిరసనన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌బి పోతురాజు, పి.సురేష్‌ కుమార్‌, సత్యనారాయణ అంగన్వాడి కార్మికుల చేపడుతున్న ఆందోళన శిబిరంలో పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే.కొండమ్మ, సత్యవతి, జీ.పవిత్ర, మీనా, బుజ్జి పాల్గొన్నారు. పాడేరు: జిల్లా కేంద్రంలో ఐటీడీఏ ఎదుట నిరవధిక దీక్షను అంగన్వాడీలు 39వ రోజు యధావిధిగా కొనసాగించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలని అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు పెద్ద ఎత్తున నిర్మించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జయ చిన్నారి, విజయ, సత్యవతి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అంగన్వాడీలు పాల్గొన్నారు.్‌ అరకులోయ:అరకులోయలో అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యరదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సామాజిక న్యాయం కోసం పోరాడిన అంబేద్కర్‌ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించడాన్ని హర్షిస్తున్నామన్నారు. లక్ష మంది పైగా ఉన్న అంగన్‌వాడీ మహిళలకు న్యాయం చేయకుండా సామాజిక న్యాయం చేస్తామనడంలో అర్థం లేదని తెలిపారు. అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తు న్నామని నూతన నోటిఫికేషన్‌ ఇస్తున్నామని బెదిరింపులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమైన ఆలోచన అని ఆయన విమర్శించారు. అంగన్వాడీలు అంబేద్కర్‌ విగ్రహం ముందు సత్యాగ్రహం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు వెంకటలక్ష్మి, లక్ష్మి, నిర్మల, భారతి, భవాని, సీత, గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.పెదబయలు: మండల కేంద్రంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ( సిఐటియు) ఆధ్వర్యంలోఅంగన్వాడీలు సమ్మెను కొనసాగిం చారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు టి.రాజమ్మ, మంగమ్మ, పద్మ, కొండమ్మ, సుశీల పాల్గొన్నారు.చింతపల్లి: మండలంలో అంగన్‌వాడీలు సమ్మెను కొనసగించారు. ఈ సందర్భంగా సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ, అంగన్‌వాడీలు రోడ్డెక్కి పోరాటం చేస్తుంటే నిర్బంధం చేసి అణచివేసే ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. సామాజిక న్యాయం అంటూ ఏ మొహం పెట్టుకొని అంబేద్కర్‌ విగ్రహాన్ని సిఎం ఆవిష్కరించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు కార్యదర్శి పెంటమ్మ, లక్ష్మి, అక్కమ్మ, ఇందు, చెల్లయమ్మ వరలక్ష్మి పాల్గొన్నారు.అనంతగిరి:తహాశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం నుంచి సిఐటియు ఆధ్వర్యాన అంగన్‌వాడీ కార్యకర్తలు మూడు రోడ్ల జంక్షన్‌ మీదుగా అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీగా నిర్వహించారు అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి సర్పంచ్‌ కె.మొస్య. అంగన్వాడి యూనియన్‌ మండల నాయకురాలు పి.మంజుల, సిఎస్‌ కళావతి పాల్గొన్నారుఅంబేద్కర్‌ విగ్రహారం వద్ద సత్యాగ్రహం చింతూరు:తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని 39వ రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు శుక్రవారం స్థానిక అంబేద్కర్‌ విగ్రహం దగ్గర సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. ఇందులో పాల్గొన్న సిఐటియు ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ మాట్లాడుతూ 39 రోజుల నుండి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్‌, సిఐటియు నాయకులు పొడియం లక్ష్మణ్‌, యూనియన్‌ నాయకులు నూకరత్నం, వెంకటరమణ, కామేశ్వరి, సత్యవతి, విజయకుమారి, సఫీ, లలిత, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.విఆర్‌.పురం : మండల కేంద్రం రేఖపల్లి సెంటర్లో 39 రోజులుగా దీక్షలు చేస్తున్న అంగన్వాడీలు శుక్రవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో కార్మికులకు, మహిళలకు కల్పించిన హక్కులను కాపాడాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సున్నం రంగమ్మ, యూనియన్‌ నాయకులు నాగమణి, రాజేశ్వరి, కనకమహాలక్ష్మి, ప్రజా నాట్యమండలి నాయకులు సిహెచ్‌ సుబ్బారావు పాల్గొన్నారు.అడ్డతీగల : 39వ రోజు అంగన్వాడీల ఆందోళనల్లో భాగంగా స్థానిక మండల కేంద్రంలో అంగన్వాడీలు డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ మొండి వైఖరి విడనాడి సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి నిర్మల, బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు.రంపచోడవరం : స్థానిక తహసిల్దార్‌ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె నేటికీ 39వ రోజుకు చేరుకుంది. స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. రాజవొమ్మంగి : అంగన్వాడీలు శుక్రవారం స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. అంగన్వాడీల దీక్షకు గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, మండల కార్యదర్శి కొండ్ల సూరిబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు, డివైఎఫ్‌ఐ నాయకులు టి శ్రీను తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్‌ నాయకులు చిన్ని కుమారి, కె వెంకటలక్ష్మి, ఎల్‌ సత్యవతి, రమణి, రమణ, రత్నం, చిన్నమ్మలు, సుందరమ్మ, నాగమణి, రాధ, భవాని, రాజేశ్వరి, లక్ష్మి, వీరయ్యమ్మ, వీరలక్ష్మి, పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.కూనవరం : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జగన్మోహన్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలని, పని భారం తగ్గించాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని కోరుతూ అంగన్వాడీల ఆందోళన 39వ రోష్ట్ర కొనసాగింది. అనంతరం కూనవరం సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి మెమోరాండం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కొమరం పెంటయ్య, యనియన్‌ నాయకులు అన్నపూర్ణ, లలిత, అంజమ్మ, ప్రసన్న, అంగన్వాడీలు, తాళ్లూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.సీలేరు : జీకే వీధి మండల కేంద్రంలో 39వ రోజు ఆందోళన కార్యక్రమం శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గడుతూరి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చడంలో అలసత్వం ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బుజ్జిబాబు, యూనియన్‌ అధ్యక్షులు ఎల్‌. సత్యవతి ఎస్‌. అప్పలనసమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️