ఇంజరిలో అబ్రహం పర్యటన

ప్రచారం చేపడుతున్న అబ్రహం

ప్రజాశక్తి-పెదబయలు :మండలంలోని ఇంజరి పంచాయతీలో బుధవారం టిడిపి రెబల్‌ సెవెరీ అబ్రహం పర్యటించారు. సివేరి సోమ చేసిన సేవలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను అందజేశారు అనంతరం అబ్రహం మాట్లాడారు. ప్రజ శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తనకు ఆశీర్వదించాలని కోరారు.తన తండ్రి హయంలో మారుమూల గ్రామాల్లో జరిగిన అభివద్ధి తప్ప ఈ ఐదు సంవత్సరాలలో ఎటువంటి అభివద్ధి జరగలేదని అన్నారు.తనకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదిస్తే మారుమూల గ్రామాల అభివద్ధి కి పాటుపడతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి సోనే దన్ను, రెబల్‌ టీడీపీ మండల కార్యదర్శి పాంగినాగేశ్వరావు, అరకు పార్లమెంట్‌ రైతు సంఘం ఉపాధ్యక్షుడు కూడా బుషణ్‌ రావు, యునిట్‌ ఇంచార్జి లక్కేరామన్న దొర పాల్గొన్నారు.

➡️