కొనసాగిన రిలే దీక్షలు

దీక్ష చేపడుతున్న ఆదివాసీలు

ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలో గిరిజ నేతరురాలు బుడ్డిగ కొండమ్మ ఇల్లు, షాపులు కూల్చి వేయాలని నిరసిస్తూ ఆదివాసి గిరిజనుల చేస్తున్న రిలే దీక్షలకు సోమవారం కొనసాగాయి. హుకుంపేట వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు దీక్షలకు మద్దతు పలికారు. అనంతరం కొండలరావు మాట్లాడుతూ, రెవెన్యూ అధికారులు గిరిజనేతరులకు సహకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఆక్రమణ దారులపై ఎన్టీఆర్‌ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తడిగిరి వైస్‌ సర్పంచ్‌, గిరిజన సంఘం జిల్లా నాయకులు కిల్లో రామారావు, ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ రాజు, ఆదివాసీ గిరిజన నాయకులు కొర్ర ఆనంద్‌, పాడి సుమన్‌, కొర్ర నర్సింగరావు, కొర్ర నూకరాజు, జన్ని దిల్సన్‌ బాలన్న పాల్గొన్నారు.

➡️