క్షయ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

పరీఓలు చేస్తున్న టిబి వైద్య అధికారి

ప్రజాశక్తి-హుకుంపేట:బాకూరు పంచాయితీ బాలురు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు టిబి వైద్య అధికారి డాక్టర్‌ సౌమ్య రోసి బుధవారం క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ, రెండు వారాలకు మించి దగ్గు, కపం, రాత్రిపూట జ్వరం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే దగ్గర్లో ఉన్న ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జరకొండ పంచాయతీ గేదెలపాడు లో టిబి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 24 మందికి కఫం పరీక్షలు చేశామన్నారు. వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ. 500లు పౌష్టికాహారం కింద ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి పి.పండు నాయుడు, టిబి సూపర్వైజర్‌ సదానందం, ఫీల్డ్‌ కోఆర్డినేటర్‌ ధనరాజు, సిహెచ్‌ఓ నాగమణి, హెల్త్‌ అసిస్టెంట్‌ బాలయ్య దొర పాల్గొన్నారు.

➡️