గంజాయి సాగు చేస్తే కఠిన శిక్షలు

ప్రజాశక్తి -అరకులోయరూరల్‌:మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం గంజాయి, నాటు సారా కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ఏ గణపతి బాబు మాట్లాడుతూ, గిరిజనులు గంజాయి సాగుతో డబ్బులకు ఆశపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పారు. రవాణా చేసి దొరికితే బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పారు.డుంబ్రిగుడ ఎస్సై సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలు ఉపయోగించి తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ శాఖ పోలీస్‌లు పాల్గొన్నారు.డుంబ్రిగుడ: అరకు ఎక్స్చేంజ్‌ శాఖ, డుంబ్రిగూడ పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గంజాయి, నాటు సారాతో అనర్ధాలపై శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ఏ గణపతి బాబు మాట్లాడుతూ, గంజాయితో పట్టుబడితే కఠిన శిక్షలు ఉంటాయన్నారు.

➡️