గంటల తరబడి నిరీక్షణ

చెట్టు కింద కూర్చున్న గిరిజనులు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:మండలంలోనీ మాదల పంచాయతీ పరిధిలోని గ్రామాలకు సెల్‌ సిగల్స్‌ అందక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. సెల్‌ సిగల్స్‌ కోసం నాలుగైదు కీలో మీటర్లు దూరం వెళ్లవసిందే.ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆన్‌లైన్‌ చేసుకోవడం ఇబ్బందికరంగా ఉందని, సిగల్‌ లేక ఇబ్బందులు తప్పడం లేదని గిరిజనులు ఆవేధన వ్యక్తం చేశారు. ఈ పరితిస్థి మండలంలోని మాదల పంచాయతీలో నెలకోంది.సెల్‌ టవర్‌ ఉన్నప్పటికీ అది పని చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మాదల పంచాయతీ ముల్యగలుగు రెవెన్యూ గ్రామ పరిధిలోని మజ్జివలస, నందివలస, దుమ్మగుడ్రి తదితర గ్రామస్థులకు ఈ మధ్య కాలంలో ప్రభుత్వ రీ సర్వేలో భాగంగా శాశ్వత భూ హక్కు పత్రాలు పంపిణి చేశారు. ఈ పట్టాలకు ఆధార్‌ అనుసంధానం చేసుకోవడం కోసం బయోమెట్రిక్‌ ఈకేవైసి చేసుకోవాలి. లేకపోతే రైతు భరోసా వివిధ ప్రభుత్వ పథకాలు రావు. దీంతో, ప్రతీ రోజు చెట్ల కిందకు వెళ్లి సిగల్స్‌ కోసం నిరీక్షిస్తున్నారు. పంచాయితీ పరిధిలో రెండు సెల్‌ టవర్ల ఏర్పాటు చేసినా పని చేయలేదు. దీంతో చెట్టు కిందనే సచివాలయ ఉద్యోగులు, వాలెంటీర్లు విధులు నిర్వహణ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఇంటర్‌నెట్‌ సేవలు అందించాలని గ్రామస్థులు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు.

➡️