చాపరాయిలో పర్యాటకుల సందడి

చాపరాయిలో పర్యాటకుల సందడి

చాపరాయి వద్ద పర్యాటకులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతంలో ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు పోటెత్తారు. పర్యాటకుల తాకిడితో చాపరాయి జలపాతంలో పర్యాటకుల ఆటపాటలతో సందడి వాతావరణం నెలకొంది. జలపాతంలో జారుతూ స్థానాలు చేస్తూ ఆనందంగా గడిపారు. అంజోడా సిల్క్‌ ఫారం, కోల్లపుట్టు జలతరంగిని పర్యాటక ప్రదేశాల్లో కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. పర్యాటకుల తాకిడితో సందడి వాతావరణం నెలకొంది.

➡️