నిత్యావసర సరుకులు పంపిణీ

సరుకులు పంపిణీ చేస్తున్న ముస్లిం పెద్దలు

ప్రజాశక్తి-చింతపల్లి:రంజాన్‌ మాసాన్ని (పర్వదినాన్ని) పురస్కరించుకుని మండల కేంద్రంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు స్థానిక ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 25 కేజీల బియ్యం, ఐదు కిలోల గోధుమపిండి, కేజీ నూనె, ఇతర నిత్యవసర సరుకులు గ్రామంలోని 15 నిరుపేద కుటుంబాలకు ముస్లిం కమిటీ అధ్యక్షుడు షేక్‌ మీరా, మజీద్‌ ఇమామ్‌ ఎండి ముజీబ్‌, మండల కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ నాజర్‌ వల్లి, ఉప సర్పంచ్‌ నూరు బాబులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️