పండగ వేళా.. సమ్మె శిబిరాల్లోనే.

సంక్రాంతి, కనుమ

.రాజవొమ్మంగి : సంక్రాంతి, కనుమ పండగల వేళ అంగన్వాడీలు స్థానిక సమ్మె శిబిరం వద్దనే రంగుల ముగ్గులు వేసి, కార్మిక గీతాలకు లయబద్ధంగా నృత్యాలు చేసి నిరసన తెలిపారు. సమ్మె డిమాండ్లు ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు చూపరులను ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.కుమారి, కె.వెంకటలక్ష్మి, నాయకులు ఎల్‌.సత్యవతి, నూకరత్నం, నర్సవేణి, రమణి, మంగ, చిన్నమ్మలు, సుందరమ్మ, రత్నం, నాగమణి, రాధ, భవాని, రాజేశ్వరి, లక్ష్మి, వీరయ్యమ్మ, వీరలక్ష్మి పాల్గొన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.రామరాజు వారి పోరాటానికి మద్దతు తెలిపారు. విఆర్‌.పురం : సమ్మె శిబిరం వద్దనే స్థానికంగా అంగన్‌వాడీలు పండగ చేసుకుని నిరసన తెలిపారు. రేఖపల్లి శిబిరం వద్ద ఎస్మా చట్టం ప్రతులను గంగిరెద్దుకు అందజేశారు. సమ్మె డిమాండ్లు ప్రతిబింబించేలా సంక్రాంతి ముగ్గులు వేశారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు నాగమణి, కార్యదర్శి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వారి పోరాటానికి సిఐటియు జిల్లా నాయకులు పూనం సత్యనారాయణ, సున్నం రంగమ్మ తదితరులు మద్దతు తెలిపారు. మారేడుమిల్లి : స్థానికంగా అంగన్‌వాడీల పోరాటానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.శాంతిరాజు మద్దతు పలికారు. అంగన్‌వాడీలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు రత్న కుమారి, మారేడుమిల్లి, వై.రామవరం మండలాలకు చెందిన అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️