పట్టు విడువక..

అరకులోయలో చేపడుతున్న భారీ ర్యాలీ

ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేపడుతున్న సమ్మె శుక్రవారం 18వ రోజుకు చేరింది. సమ్మె శిబిరాల్లో అంగన్‌వాడీలు ఆందోళనలు చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు.అరకులోయ రూరల్‌:రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు శుక్రవారం మద్దతు తెలిపిన ఆదివాసీ గిరిజన సంఘం, సిఐటియూ, ఎస్‌ఎఫ్‌ఐ వివిధ ప్రజా సంఘాలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం నుండి ఎంపిడిఓ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర మాట్లాడుతూ, అంగన్వాడీలు ధైర్యంగా పోరాడాలని, మీ వెంట ప్రజా సంఘాలు అండగా ఉంటాయని భరోసా కల్పించారు.రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల, కష్టజీవులు పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. జగన్‌ ఇచ్చిన మాట నిల బెట్టుకోవాలని, లేకుంటే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. .ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు దురియ నాగమ్మ, హాస్టల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు పాడి కొండలరావు, ఐటిడి వర్కర్స్‌ యూనియన్‌, అధ్యక్షులు దాడి రాజు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఏసుబాబు, కాఫీ రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ సుంకరమెట్ట సర్పంచ్‌ గేమిలి చినబాబు, జిసిసి సోప్‌ యూనిట్‌ అధ్యక్షులు సింహాద్రి, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ కన్నమ్మ, ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు బుజ్జిబాబు, నిర్మల లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.ముంచంగిపుట్టు:అంగన్వాడీల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. అంగన్‌ వాడీ వర్కర్లు, హెల్పర్‌ యూనియన్‌ నాయకులు మావులమ్మ, సుజాత మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చి సమస్యలను పరిష్కారం చేయాలన్నారు. లేకుంటే పోరాటం ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు పి.భీమరాజు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సత్యవతి, కాంతమ్మ, పార్వతి, నిర్మలమ్మ, భవాని, దేవి తదితరులు పాల్గొన్నారు.సమ్మెకు సిపిఎం మద్దతుఅనంతగిరి: అంగన్వాడీల సమ్మెకు స్థానిక సిపిఎం జెడ్పిటిసి దీసరి గంగరాజు మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలను ఉదృతం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను ఉదృతం చేపడతామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల యూనియన్‌ ప్రతినిధులు సిఎస్‌ కళావతి, పి,మంజుల, చిలకమ్మ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మంత్రి, వైవీని అడ్డగింతహుకుంపేట:మండలంలోని పీఎంఆర్‌సీ వద్ద సీఐటీయూ యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా మంత్రి అమర్‌నాధ్‌, వైసీపీ ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డిలను అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం, రూ.5 లక్షల బీమా, జీతంతో సగం పెన్షన్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్యాస్‌ను ప్రభత్వమే సరఫరా చేయాలన్నారు. అంగన్వాడీ జిల్లా నేతలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, కృష్ణవేణి, వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావుల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో భాగ్య, పద్మ, పూర్ణిమా, సుజాత, రాజేశ్వరి, అప్పలకొండమ్మ, ఈశ్వరమ్మ, వసంత, పుష్పవతి, రాధిక, నారాయణమ్మ, సన్యాసమ్మ పాల్గొన్నారు.వైవిని అడ్డగించిన అంగన్వాడీలు పాడేరు: హుకుంపేటలో శుక్రవారం నిర్వహించిన సాధికార బస్సు యాత్రలో పాల్గొనేందుకు వస్తున్న వైయస్సార్సీపి ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి .సుబ్బారెడ్డి వాహనాన్ని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు శుక్రవారం పాడేరులో అడ్డగించారు. పాడేరులోని అంగన్వాడి దీక్షా శిబిరం ఎదురుగా రోడ్డుపై అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించి నినదించారు. ఈ క్రమంలో పోలీసులతో అంగన్వాడీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం వాహనం దిగి వచ్చిన సుబ్బారెడ్డి అంగన్వాడి వర్కర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం పరిధిలో అంగన్వాడి వర్కర్ల సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తాను కూడా అంగన్వాడి వర్కర్ల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిస్తానని, త్వరలో ప్రభుత్వం అంగన్వాడి ల సమస్యల్ని పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి చిన్నారి, ఇంద్ర, జయ, విజయ, లక్ష్మి కొండమ్మ, సత్యవతి పాల్గొన్నారు. వరి గడ్డి తింటూ నిరసన చింతపల్లి:మండలంలో అంగన్వాడీలు నోట్లో వరి గడ్డి వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ, కొన్ని జిల్లాల్లో వాలంటీర్లు ఇప్పటికే పోరాటం చేస్తున్నారని కలిసికట్టుగా చేయాలన్నారు. అంగన్వాడీలు, ఆశ, సిహెచ్‌డబ్ల్యూ, మున్సిపల్‌, కార్మికులు పోరాటం చేస్తున్నారని, ప్రభుత్వం పట్టు విడుపులకు పోకుండా దిగివచ్చి సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు పెంటమ్మ, రాములమ్మ, లక్ష్మి, ప్రసన్న, సత్యవతి పాల్గొన్నారు. జి.మాడుగుల: మండల కేంద్రంలో అంగన్వాడీలు దీక్షా శిబిరం వద్ద కళ్ళకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని నినాదాలు చేశారు. అంగన్వాడి యూనియన్‌ నాయకులు మోదకొండమ్మ, వరహాలమ్మ, వెంకటలక్ష్మి, సింహాచలం, కాంతమ్మ, రాజేశ్వరి, సత్యవతి పాల్గొన్నారు.రంపచోడవరం: ని అంగన్వాడీ వర్కుర్లు, ఆయాలు చేస్తున్న సమ్మె 18వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నిరాహార దీక్షలో భాగంగా శనివారం ఆవుకు వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీల దీక్షకు టిడిపి మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవార్చాలని వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు కె.రామలక్ష్మి, సింగరమ్మ, సత్యవతి, టిడిపి నాయకులు అనంత మోహన్‌, సిద్దా వెంకన్న దొర, అంగన్వాడీలు పాల్గొన్నారు.మారేడుమిల్లి : ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు తమ దీక్షలు కొనసాగుతాయని సిఐటియు రంపచోడవరం జిల్లా కార్యదర్శి బీ నిర్మల కుమారి, ఉపాధ్యక్షురాలు కే రాణి స్పష్టం చేశారు. మండల కేంద్రంలో 18 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న దీక్షలకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.కొయ్యూరు : మండల కేంద్రంలో అంగన్వాడీల సమ్మెలో భాగంగా స్టీలు కంచాలు మోగిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జీతాలు పెంచాలని మౌన దీక్ష చేపట్టారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చేంతకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకురాలు అచ్చయ్య, ముత్యాలమ్మ,అంగన్వాడీలు పాల్గొన్నారు.సీలేరు : జీకే వీధి మండల కేంద్రంలో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన 18వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఎల్‌ సత్యవతి, జి దయ, వెంకటి, యశోద, చిరంజీవి, మేరీ, భవాని, భోడేశ్వరి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గడుతూరి సత్యనారాయణ, అంగన్వాడి వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.ఆశా వర్కర్ల సంఘీభావంచింతూరు : తమ సమస్యలను పరిష్కారం చేయాలని చింతూరు మండల కేంద్రంలో అంగన్వాడి కార్మికులు చేస్తున్న ఆందోళన 18వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా శనివారం ఆందోళన శిబిరాన్ని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన ఆశా కార్యకర్తలు సందర్శించి సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల సమస్యలను, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వీరమ్మ, ముత్తమ్మ, లక్ష్మి, అనిత, జయ, కాంతమ్మ పాల్గొన్నారు.

➡️