Amarnath Yatra ప్రారంభం – కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

శ్రీనగర్‌ : అమర్‌నాథ్‌ యాత్ర శనివారం ప్రారంభమైంది. శ్రీనగర్‌లోని హిమాలయాల్లో ఉన్న ఆలయ దర్శనం కోసం బాల్టాల్‌, నునావన్‌ క్యాంపుల మొదటి బ్యాచ్‌ యాత్రికులు బయలుదేరారు. ఈసారి ఈ యాత్ర నెలన్నర పాటు కొనసాగనుంది. ఆగస్టు 19న అమర్నాథ్‌ యాత్ర ముగుస్తుంది. ఈ మేరకు అధికారులు ప్రజలకు సమాచారం అందించారు. నువాన్‌-పహల్గామ్‌ రూట్లో 48 కిలోమీటర్లు, బల్తాల్‌ రూట్లో 14 కిలోమీటర్ల మార్గంలో ప్రజలు వెళుతున్నారు. ఈ రెండూ అమర్‌నాథ్‌ యాత్రకు మార్గాలు. ఈ రెండు మార్గాల్లో యాత్రికుల బృందాలను సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, పోలీసు పరిపాలనలోని సీనియర్‌ అధికారులు పంపినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా శుక్రవారం ఉదయం జమ్మూలోని భగవతి నగర్‌లోని యాత్రి బేసిక్‌ క్యాంప్‌ నుండి 4,603 మంది యాత్రికులను జెండా ఊపి పంపించారు. ప్రభుత్వ అధికారులు జెండా ఊపి యాత్రికులకు గుడ్‌లక్‌ చెప్పారు. ఈ క్రమంలో.. యాత్రికులు మధ్యాహ్నం కాశ్మీర్‌ లోయకు చేరుకోగా అక్కడ వారికి స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. యాత్ర సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు.. ఇతర పారామిలటరీ బలగాలకు చెందిన వేలాది మంది భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

➡️