పల్స్‌ పోలియోపై అవగాహన

మానవహారం చేపడుతున్న విద్యార్థులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ఈనెల 3 నుంచి 5 వరకు జరగనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మూడు రోడ్ల జంక్షన్‌ వరకు శుక్రవారం వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యాధికారి పి రాంబాబు మాట్లాడుతూ, సున్న నుంచి ఐదేళ్లు లోపు గల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం పి హెచ్‌ఓ సౌరి, హెల్త్‌ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️