పిఒకు ఘనంగా సత్కారం

సన్మానిస్తున్న సబ్‌కలెక్టర్‌, అధికారులు

ప్రజాశక్తి-పాడేరు- ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌ను రెవెన్యూ అధికారులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. నూతన సబ్‌ కలెక్టర్గా పి.ధాత్రిరెడ్డి మూడు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు ఇన్చార్జి సబ్‌ కలెక్టర్‌, ఐ.టి.డి.ఏ పిఓ విధులు నిర్వహించారు. బుధవారం సబ్‌ కలెక్టర్‌గా విధుల నుండి రిలీవ్‌ అయ్యారు. శనివారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి సబ్‌ కలెక్టర్‌ గా ఆయన చేసిన సేవలను ఏలువురు తహశీల్దారులు కొనియాడారు.ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ అభిషేక్‌ మాట్లాడుతూ, అందరి సహాకారంతో సబ్‌కలెక్టర్‌గా సంతృప్తికర మైన సేవలు అందించానని చెప్పారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పాడేరుకు బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి కృషి చేసానన్నారు. ఏజెన్సీలో కమ్యూనికేషన్‌ వ్యవస్థ మెరుగు పరచడానికి సెల్‌ టవర్ల నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ చేసానన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ ధాత్రి రెడి,్డ 11 మండలాల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️