వినూత్న నిరసనల హోరు

అడ్డతీగలలో గడ్డి తింటూ నిరసన చేపడుతున్న అంగన్‌వాడీలు

 

ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగంసమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపడుతున్న సమ్మె వినూత్న నిరసనలతో సాగింది. అల్లూరి జిల్లాలోని పలు చోట్ల వివిధ రూపాల్లో నిసననలు శనివారం కొనసాగించారు. పెదబయలు :అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు )ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సమ్మె కొనసాగింది. చెవిలో పూలు పెట్టుకొని వినూత్నంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా నాయకురాలు టి.రాజమ్మ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే జీతాలు పెంచకుండా మా చెవిలో పూలు పెట్టిందని విమర్శించారు. 12 రోజులుగా సమ్మె కొనసాగుతుంటే ప్రభుత్వంనికి చీమకుట్టినట్టు లేదని, మంత్రులు తలోక మాట మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు, టి.రాజమ్మ, శాంతి, కొండమ్మ, వరహాలమ్మ, దేవి, శాంతి, మంగమ్మ పాల్గొన్నారు.హుకుంపేట: స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మెకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌.హైమావతి, అనంతగిరి జెడ్పిటిసి సభ్యులు దీసారి గంగరాజు, తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గం ఇన్చార్జ్‌ సివేరి దొన్నుదొర మద్దతు తెలిపారు. ముందుగా అంగన్వాడీ ఐసిడిఎస్‌ కార్యాలయం నుండి మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టి మనోహరం నిర్వహించారు. అనంతరం జెడ్పిటిసి సభ్యులు గంగరాజు మాట్లాడుతూ, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేసి, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గం ఇన్చార్జ్‌ సివేరి దొన్నుదొర మాట్లాడుతూ, జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు.మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్‌ ఇవ్వాలన్నారు. సెంటర్‌ల అద్దెలు, టిఎ బిల్లులు వెంటనే చెల్లించాలని, మెడికల్‌ లీవ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సంఘం నేతలు కె.కొండమ్మ, డి.వసంతకుమారి, సిపిఎం మండల కార్యదర్శి వి.లక్ష్మణరావు, గిరిజన సంఘం నాయకుడు నరాజీ సురేష్‌, జనసేన అరకు నియోజకవర్గ ఇన్చార్జ్‌ చిరంజీవి, ఎస్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు శెట్టి లక్ష్మణుడు, మండలధ్యక్షులు తులసిరావు, సీనియర్‌ నాయకులు బొడ్డ శ్యాంసుందర్‌, పెదలబుడు సర్పంచ్‌ పెట్టెలి దాసు బాబు, తాడేపూట్‌ సర్పంచ్లు సోమేల లక్ష్మయ్యచ బొంజన దొర, పాడి బాలన్న, మాజీ సర్పంచ్‌ శతక బొంజుబాబు, అరకు అసెంబ్లీ అధికార ప్రతినిధి లక్ష్మి పాల్గొన్నారు.అరకులోయ రూరల్‌:అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టి నిరసన తెలియజేశారు. ఈ సమ్మెకు అరకువేలి సిపిఎం మండల కార్యదర్శి కె.రామారావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ. వైసీపీ ప్రభుత్వం అధకారంలోకి వస్తే అంగన్వాడి అక్క చెల్లమ్మలకు తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా జీతాలు పెంచుతామని మాయమాటలు చెప్పి తీవ్రంగా మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు డి.నాగమ్మ, మండల అధ్యక్షురాలు పాంగి వెంకట్‌లక్ష్మి, కార్యదర్శి కొర్రా లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు డి.నాగమ్మ, రాధ భారతి, నిర్మల, సీత, గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.ముంచంగిపుట్టు : స్థానికంగా అంగన్‌వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. వారి పోరాటానికి ఆదివాసీ మాతృభాషా విద్యావాలంటీర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.చంద్రయ్య, కె.కొండయ్య మద్దతు తెలుపుతూ మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కొర్ర శంకరరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, లక్ష్మీపురం సర్పంచ్‌ కొర్ర త్రినాధ్‌, సిపిఎం మండల కార్యదర్శి భీమరాజు, ఎంఎం.శ్రీను, కె.నర్సయ్య, ఉపసర్పంచ్‌ వి.గణపతి, ప్రకాష్‌, చిన్నయ్య, అంగన్‌వాడీ కార్యకర్తలు కాంతమ్మ, మౌళమ్మ, కళ, భవాని పాల్గొన్నారు. ఒంటికాలుపై అంగన్వాడీల నిరసన రాజవొమ్మంగి : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన రాజవొమ్మంగి మండల కేంద్రం ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం ఎదురుగా అంగన్వాడీలు చేపట్టిన నిరసన దీక్షలు శనివారం నాటికి 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు శిబిరంలో ఒంటి కాలుపై నిలబడి నిరసన తెలిపారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు గిరిజన సంఘం నాయకులు, పి.రామరాజు, కె.సూరిబాబు, తెడ్ల అబ్బాయి, సిహెచ్‌.ధర్మరాజు , యూనియన్‌ నాయకురాలు కె.వెంకటలక్ష్మి, సిహెచ్‌.కుమారి, ఎల్‌ సత్యవతి, కె లక్ష్మి, చిన్నమ్ములు, రమణి, రమణ, రత్నం, రాజేశ్వరి, మంగ,రాధ పాల్గొన్నారు.సీలేరు : జీకే వీధి మండలం కేంద్రంలో అంగన్వాడి వర్కర్లు ఆందోళన కార్యక్రమం 12వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు అల్లూరి జిల్లా సహాయ కార్యదర్శి గడుతురు సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కోలాటం ఆడి నిరసనకొయ్యూరు : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయంలో అంగన్వాడీల 12వ రోజు ఆందోళన సందర్భంగా అంగన్వాడీలు శిబిరం వద్ద ఆట పాట, కోలాటం ఆడి నిరసన తెలిపారు. వీరికి ఆందోళనకు సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు ఎస్‌.సూరిబాబు మద్దతు తెలిపారు. పచ్చిగడ్డి తింటూ…అడ్డతీగల : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో 12 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు, శనివారం దీక్షా శిబిరంలో మోకాళ్లపై నిల్చుని, పచ్చగడ్డి తింటూ వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ డివిజనల్‌ నాయకురాలు బి.నిర్మల, బేబీ రాణి, పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.భిక్షాటనమోతుగూడెం:చింతూరు మండలం, మోతుగూడెంలో శనివారం అంగన్వాడీ కార్యకర్తలు భిక్షాటన చేశారు. ప్రతి దుకాణానికి వెళ్లి తమ సమస్యల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తెలియజేస్తూ ఈ భిక్షాటన చేశారు. డొంకరాయి ఎంపీటీసీ కరక రమణ, మోతుగూడెం ఎంపీటీసీ వేగి నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. టిడిపి జనసేన మద్దతురంపచోడవరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన నిరసన దీక్షలు 12వ రోజు కొనసాగాయి. ఈ దీక్షా శిబిరాన్ని శనివారం రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జనసేన నాయకులు కుర్ల రాజశేఖర్‌ రెడ్డి, ఆయా పార్టీల నాయకులు సందర్శించి సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయుకలు కె రామలక్ష్మి, కె.సింగారమ్మ, వి.సత్యవేణి, టిడిపి నాయకులు కారం సురేష్‌ బాబు, జనసేన నాయకులు పాపోలు శ్రీనివాస్‌, చక్రపాణి, నాగు, పండు, గళ్ళ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.న్యాయవాదుల యూనియన్‌ మద్దతువిఆర్‌.పురం : మండల కేంద్రం రేఖపల్లిలో అంగన్వాడీల ఆందోళన 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా రంపచోడవరం న్యాయవాదుల యూనియన్‌ నాయకు.లు రవితేజ అంగన్వాడీల ఆందోళనకు మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, యూనియన్‌ నాయకులు సున్నం రంగమ్మ, నాగమణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.అంగన్వాడీ కేంద్రాల సరుకులు పోతే ప్రభుత్వానిదే బాధ్యతమారేడుమిల్లి : మండల కేంద్రంలో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన 12వ రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా మండలంలో పలు చోట్ల ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి ఓపెన్‌ చేశారని, అంగన్వాడీ కేంద్రాల్లో వస్తువులు ఏమైనా పోయినట్లయితే వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్లో అంగన్వాడీలు శనివారం ఫిర్యాదు చేశారు. యూనియన్‌ జిల్లా నాయకురాలు రామలక్ష్మి పాల్గొన్నారు.

➡️