వైసిపిని గద్దెదించాలి : టిడిపి

మాట్లాడుతున్న సుబ్బారావు

ప్రజాశక్తి -పాడేరు: వైసీపీ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించాలని డోకులూరు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావు శంఖారావాన్ని పూరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి మణికుమారి మాట్లాడుతూ, సూపర్‌ సిక్స్‌ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకోవడం దాచుకోవడం, మడం తిప్పం అను సినీ డైలాగులు చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి గాని ప్రజలకు గాని చేసింది ఏమీ లేదని తెలియజేశారు. నారా లోకేష్‌ తలపెట్టిన శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ని కొట్టగుళ్లి సుబ్బారావు తెలిపారు.అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ చీముడు చిట్టిబాబుకి వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలను కొట్టగుళ్లి సుబ్బారావు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ వంజంగి కాంతమ్మ , పాడేరు మాజీ సర్పంచ్‌ వర్తన పిన్నియ్య దొర, డోకులూరు మాజీ సర్పంచ్‌ తమర్బా నాగం నాయుడు, మాజీ ఎంపీటీసీ కిముడు చిట్టిబాబు, మాజీ ఎంపీటీసీ డూరి కృష్ణారావు, వంతాల కొండబాబు, వార్డు మెంబర్‌ తమర్భ కాంతమ్మ, వార్డ్‌ మెంబర్‌ గొల్లూరి చిన్నారావు, రత్నాలమ్మ పాల్గొన్నారు.

➡️