సిపిఎం అభ్యర్థులకే ఓటు

మాట్లాడుతున్న సురేంద్ర

xప్రజాశక్తి -అనంతగిరి:ప్రజల పక్షాన ఉంటూ సమస్యలపై పోరాడే సిపిఎం బలపరిచిన అరకు పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో. సురేంద్ర పిలుపునిచ్చారు.గురువారం అనంతగిరి మండల సిపిఎం కార్యకర్తల విస్తతస్థాయి సమావేశం గిరిజన సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశాం సీపీఎం టోకురు సర్పంచ్‌ కిల్లో మొస్య అద్యక్షతన జరిగింది ఈ సమవేశంలో సురేంద్ర మాట్లాడుతూ, ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఆదివాసుల హక్కులు, చట్టాలు రక్షణకై నిరంతరం పని చేస్తున్న సిపిఎం అభ్యర్థులకే ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. గిరిజన ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం అనేక పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. సాగులో ఉన్న రైతులకు పోడు భూమి పట్టాలు పంపిణీ చేయాలని అనేక అనేక పోరాటాలు చేసి సాధించడం జరిగిందన్నారు. మంచినీరు, రోడ్డు గిరిజనులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి విభజించు పాలి పాలించు అనే రీతిలో బిజెపి ప్రభుత్వం దేశంలో పాలిస్తుందనానరు. బిజెపితో భవిష్యత్తులో ముప్పు ఉందని విమర్శించారు. సీపీఎం జెడ్పీటీసీ దీసరి. గంగరాజు మాట్లాడుతూ, గ్రామాలలో రోడ్లు, తాగునీరు, ఇతర సమస్యల పరిష్కారనికి కృషి చేస్తున్నానన్నారు. పాడేరు కనెక్టివిటీ కింద మండలంలోని రాజుపాక నుండి డెక్కపురం, చీడివలస నుండి బొంగిజా, మెట్టువలస నుండి ఓనుకొండ, గుమ్మ నుండి కడారేవు, జెండా గరువు నుండి ఊటగెడ్డ, బొడ్డపాడు నుండి పుట్టపాడు మరికొన్ని గ్రామాల రోడ్లకు 2 కోట్ల 50 లక్షల నుండి మూడు కోట్లు నిదులతో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌ నాగులు, కార్యకర్తలు దేవన్న, సింగులు, కృష్ణ, దేవుడమ్మ, కాసులమ్మ, దేవి, అనకాపల్లి జిల్లా నాన్‌ షెడ్యూల్‌ పంచాయతీ గిరిజన సంఘం కార్యదర్శి వైకె దొర, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

➡️