3న పల్స్‌ పోలియోను విజయవంతం చేయండి

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ విజయసునీత

ప్రజాశక్తి-పాడేరు:5 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ వచ్చే నెల 3న పోలియో చుక్కలు వేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత ఆదేశించారు. శుక్రవారం ఐటిడిఎ సమావేశ మందిరంలో స్పందన అనంతరం కలెక్టర్‌ పల్స్‌ పోలియో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో 1,15,860 మంది సున్నా నుండి ఐదు సంవత్సారాల వయసు పిల్లలు ఉన్నారని, వారందిరికీ శత శాతం పోలియో చుక్కలు వేయాలని సూచించారు. జిల్లాలో 4252 గ్రామాలలో 352 సబ్‌ సెంటర్లు ఉన్నాయని, 2402 పోలియో బూత్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అందుకు గాను 3723 ఇంటింటి బృందాలు ఏర్పాటు చేసామని, 77 సంచార వాహనాలు కేటాయించామని, 21 ట్రాన్సిట్‌ బృందాలు ఏర్పాటు చేసామని తెలిపారు. 9608 వేక్షినేటర్లను, 268 మంది సూపర్‌వైజర్లను నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసి భావన వశిస్ట్‌, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌, డిఆర్‌ఓ లక్ష్మణమూర్తి, డిఎంహెచ్‌ఓ జమాల్‌ భాష పాల్గొన్నారు.

➡️