అవేమీ నిజం కాదు..

Jun 29,2024 19:15 #Kamal Haasan, #movie

కమల్‌ హాసన్‌, శంకర్‌ కాంబినేషన్లో వస్తోన్న ‘భారతీయుడు 2’ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కథపై, కమల్‌ హాసన్‌ పాత్రపై సోషల్‌మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులందరినీ సిద్ధార్థ్‌ చంపేస్తాడని కొందరూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై తాజాగా కమల్‌ హాసన్‌ స్పందిస్తూ.. ఓ ట్వీట్‌ రిలీజ్‌ చేశారు. ‘ఈ సినిమా గురించి రకరకాల కథలు వినిపిస్తున్నాయి. సేనాపతి గెటప్‌ గురించి కూడా కొన్ని కథలు రాస్తున్నారు. అయితే.. మీరు ఊహించుకున్నవి ఏవీ నిజం కాదు. ఈ సినిమా కథను ఎవరూ ఊహించలేకపోయారు. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను’ అని చెబుతూ, ”ఇండియన్‌ 3’లో సేనాపతి తండ్రి పాత్ర కూడా తెరపై కనిపిస్తుంది’ అని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

➡️