ఓటు కోసం వలస కూలీలు రాక

May 13,2024 00:06
ఆటోలో తరలి వచ్చిన గిరిజనులు

 

ప్రజాశక్తి- అనంతగిరి: ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మండలంలోని వలస కూలీలు తిరుగు గ్రామానికి తరలి వచ్చారు. మండలంలోని ఎన్‌ఆర్‌ పురం, భీంపొలు, గంమ్మట తదితర పంచాయతీ పరిధి గ్రామాల నుండి గిరినులు ్ల పొట్ట కుటి కోసం వలస వెళ్లారు. ఎన్నికలతరుణంలో తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు తిరిగి గ్రామాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని ఆదివారం తిరిగి వచ్చారు. ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు తదితర ప్రాంతాలకు వివిధ రకాల పనుల కోసం తరలి వెళ్లారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో చేపల చెరువులు, ఇటుకల బట్టీల్లో పనులు చేస్తుంటారు. అక్కడి ప్రాంతాల్లో ఎంతో కాయ కష్టపడి పని చేస్తుంటారు. సంవత్సరంలో సంక్రాంతి, దసరా పండగలకు సాధారణంగా మండలంలోని స్వంత ఊర్లకు వస్తుంటారు. అయితే ఈ ఏడాది ఐదేళ్ల తర్వాత ఎన్నికలు రావడంతో ఓటు వేసేందుకు తరలి వచ్చారు.

➡️