రోడ్లపై పశువుల సంచారం

May 25,2024 23:44
రోడ్డుపై కూర్చున్న పశువులు

ప్రజాశక్తి- అరకులోయ :మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పశువులు ఉండటంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం వేళలో పశువుల మంద రోడ్లపై తిరుగుతూ తిష్ట వేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఎటునుంచి ఏ పశువు దూసుకుని వస్తుందో తెలియక వాహన చోదకులు బిక్కుబిక్కుమంటూ వాహనాలు నడపవలసిన పరిస్థితి నెలకొంది. అనేకమార్లు పలువురి వాహన చోదకులపై పశువుల అడ్డంగా రావడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.పశువుల యజమానులు కూడా తమ పశువులను రోడ్లపై వదల వద్దని గతంలో అనేకసార్లు హెచ్చరించినా ఫలితం లేక పోయింది. పంచాయితీ అధికారులు సందించి రోడ్లపై తిరుగుతున్న పశువులను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.

➡️