పాత్రికేయులపై దాడులు దారుణం

Attacks on journalists are brutal
  • నిందితులను కఠినంగా శిక్షించాలి
    రాజవొమ్మంగి ప్రెస్ క్లబ్ డిమాండ్ 

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : రాప్తాడులో జరిగిన వైసిపి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ శ్రీ కృష్ణపై జరిగిన దాడి దారుణమని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బుధవారం రాజవొమ్మంగి లో జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు,ఈమేరకు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం, పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలు అందజేశారు. తాహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి జర్నలిస్టులపై దాడుల ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అల్లూరి రాజవొమ్మంగి ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జి బాలరాజు, రామరాజు, గౌరవ అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ సభకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఫోటోగ్రాఫర్‌ పై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరచడం అన్యాయమని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవారు ఎలాంటి వారైనా ప్రజా కోర్టులో నిలబడాల్సిందేనని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడి, పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం కర్నూలు లో ఈనాడు కార్యాలయంపై దాడులు చేసిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లూరి రాజవొమ్మంగి ప్రెస్ క్లబ్ సభ్యులు కె శివప్రసాద్, టి వీర్రాజు, ఏ సూరిబాబు, కె కృష్ణ,పి సత్తిబాబు, ఎస్ రాజు, బి శ్రీను,టి సాయి వినీత్,లక్ష్మణ్,బ్రహ్మాజీ, పలువురు పాత్రికేయులు ఉన్నారు.

➡️