మన్యంలో మండుతున్న ఎండలు

Apr 16,2024 00:02
గొడుగుల నీడన వెళుతున్న ఎఎన్‌ఎం శిక్షణా విద్యార్థులు

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు చుర్రుమంటున్నాడు. సోమవారం ఎండకు తోడు వడ గాడ్పులు వీయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. జన సంచారం లేక రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఇప్పుడే ఎండలు ఇంత తీవ్రంగా ఉంటే రానున్న మే, జూన్‌ నెలల్లో ఎంకెంత దారుణంగా ఉంటాయోనని జనం అందో ళన చెందుతున్నారు. చింతూరులో సోమవారం అత్యదిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం వేళ వివిధ పనుల నిమిత్తం అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణానికి వచ్చిన వారంతా వెంటనే ముగించు కొని ఇంటిదారి పట్టారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే పట్టణ పరిధిలోని ప్రధాన రహదారులు జనం లేక బోసి పోయింది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పుచ్చకాయ, చెరుకు, లస్సీ, పండ్ల రసాలు, ఐస్క్రీమ్‌, తదితర శీతల పానీయాలను సేవించారు. సోమవారం అత్యధికంగా చింతూరులో 43.1, దేవీపట్నంలో 40.1, కూనవరంలో 42.3, గంగవరంలో 41.6, అడ్డతీగల 39.2, అనంతగిరి 35.4, అరకు వ్యాలీ 37.1, నెల్లిపాక 40.8, చింతపల్లి 37.1, డుంబ్రిగూడ 36,5, జీకే వీధి 38.8, జి మాడుగుల 37.5, హుకుంపేట 34.0, కొయ్యూరు 40.6, మారేడుమిల్లి 41.1, ముంచంగిపుట్టు 36.6, పాడేరు 37.5, పెదబయలు 36.6, రాజవొమ్మంగి 40.1 రంపచోడవరం 40.1 విఆర్‌ పురం 38.8 వై రామవరం 38.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు తీవ్రంగా ఉండటంతో బయటవకు వచ్చే వారు గొడుగులను ఆశ్రయిస్తున్నారు.

➡️