ఓటు వేసేందుకు డోలీలో..

డోలీలో తీసుకెళుతున్న కుటుంబీకులు

అనంతగిరి:రోడ్డు సౌకర్యం లేక డోలీలతో వినూత్న రీతిలో నిరసన చేపడుతూ, తమ ఓటును వినియోగించుకునేందుకు గిరిజనులు తరలి వెళ్లారు. నాన్‌ షెడ్యూలు రొంపలి పంచాయితీ బూరిగా, చిన్నకోనల గ్రామాలకు చెందిన సుమారు 150 మంది పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సుమారు 12 కిలోమీటర్లు పైగా కొండ కోనల నడుమ నుండి పెదరాబా, రొంపల్లి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు.చంటి పిల్లను తలులు ఎత్తుకొని అవస్థలు పడుతూ వెళ్లారు. ప్రభుత్వం రోడ్డు సౌకర్యం కల్పించాలని వార్డు మెంబర్‌ సోమ్మెల అప్పలరాజు, గ్రామస్తులు జోగయ్య డిమాండ్‌ చేశారు.

➡️