ఉత్తమ బోధన శారద నికేతన్‌ సొంతం

Apr 27,2024 00:32
విశాలమైన స్థలంలో ఉన్న శారదా నికేతన్‌ స్కూల్‌

ప్రజాశక్తి-అరకులోయ :మట్టిలో మాణిక్యాలు గిరిజన విద్యార్థులు. గిరిజన విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనడానికి శారదా నికేతన్‌ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.టెన్త్‌ ఫలితాల్లో శారద నికేతన్‌ పాఠశాల విద్యార్థి కొర్ర కౌశిక్‌ ఏకంగా అల్లూరి జిల్లాలోనే టాపర్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. 600 మార్కులకు గాను 589 మార్కులు సాధించి జిల్లాకే టాపర్గా నిలిచాడు. దీంతో, ఆ విద్యార్థికి విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు సన్మానాలు చేస్తూ అభినందిస్తున్నారు. ఇది వరకు మైదాన ప్రాంతంలో ఉన్న కార్పొరేట్‌ విద్యాసంస్థలకే పరిమితమైన ఉత్తమ ఫలితాలు ఇప్పుడు శారదా నికేతన్‌ విద్యార్థులు కూడా తామేమి తక్కువ కాదు అన్నట్లుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తుంది..ఈ పాఠశాలలో ఈ ఏడాది 22 మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాశారు. వీరిలో కుర్ర కౌశిక్‌ 589 మార్కులు సాధించి అల్లూరి జిల్లా టాపర్గా నిలువగా, కొర్ర అనూష 555, పట్నాల మోహిత్‌ 548, అంపూలు సునీల్‌ 528, కిల్లో కావ్య శ్రీ 521, గొల్లూరి మనోహర్‌ 520, మజ్జి సంధ్య 514, గేమిలి హారిక 513, గూడెన శివరామరాజు 509 మార్కులు సాధించి తమ సత్తా చాటారు.అలాగే షేక్‌ సహిదబేగం 499, కొర్ర ప్రియదర్శిని 497, దొర స్టీఫెన్‌ సన్‌ మనోహర్‌ 486, బంతు జగదీష్‌ బాబు 452, కొర్ర మనోహర్‌ 448, చింతాడ సామ్యూల్‌ పాల్‌ 441, తాంగుల సునీత 429, సందడి సాయి 428, ధనుంజరు గుప్తా 422, టీ వీక్లీప్‌ బాబు 422, ఆశి ధనుష్‌ రెడ్డి 388, కొర్ర నవీన్‌ 376, కొర్ర పూజ 339 మార్కులు సాధించారు. ఈ పాఠశాల విద్యార్థులు 22 మందికి 22 మంది పాసై శత శాతం ఉత్తీర్ణత సాధించారు.అరకులోయలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సర్పగూడా హౌసింగ్‌ కాలనీ సమీపంలో విశాలమైన ప్రదేశంలో డి.శారద ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శారదా నికేతన్‌ పాఠశాల నడుపుతున్నారు. డి.శారద ఆశయ సాధన కోసం గిరిజన ప్రాంతంలో నాణ్యమైన క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి ఈ ప్రాంత విద్యార్థిని, విద్యార్థులు ఉన్నత స్థాయిలో చేరుకొని ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో 2007లో శారద నికేతన్‌ పాఠశాలను శారద ట్రస్టు నెలకొల్పి ఇంగ్లీష్‌ మీడియం విద్యనందిస్తున్నారు.ఎల్‌కేజి నుంచి 5వ తరగతి వరకు ప్రారంభమైన ఈ పాఠశాలలో నాణ్యమైన విద్య నందించడంలో ముందడుగులో ఉండటంతో దినదినం అభివృద్ధి చెందుతూ 10వ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ అయింది. ప్రస్తుతం 920 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయులు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడమే కాకుండా ఎల్కేజీ నుంచి టెన్త్‌ క్లాస్‌ వరకు కూడా కంప్యూటర్‌ విద్య పరిజ్ఞానం నేర్పిస్తున్నారు. సైన్స్‌ ల్యాబ్‌, విశాలమైన ఆటస్థలం, విద్యార్థుల మేధస్సును పెంచేందుకు ప్రత్యేకమైన లైబ్రరీ, ఆర్వో ప్లాంట్‌, ప్రత్యేకమైన టాయిలెట్ల సదుపాయం, విశాలమైన ప్లే గ్రౌండ్‌ తదితర ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి. అంతే కాకుండా, నాణ్యమైన విద్యను అందించే క్వాలిఫైడ్‌ టీచర్స్‌ ఉన్నారు.ప్రిన్సిపాల్‌ చిరంజీవి పర్యవేక్షణలో ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థులు చదువు పట్ల మంచి ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రతి ఏడాది సమ్మర్లో ఉచిత పాలిటెక్నిక్‌ శిక్షణ, ఏపీఆర్‌ కోచింగ్‌ నిర్వహిస్తున్నారు. మెడికల్‌ క్యాంపులు వంటి సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించి శారదానికేతన్‌ తనదైన ముద్ర వేసుకుంది. ఉచిత నవోదయ పరీక్ష కోచింగ్‌, ఇతర స్కిల్‌ డెవలప్మెంట్‌ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో, శారద నికేతన్‌ పాఠశాల అరకులోయకే పరిమితం కాకుండా ఏజెన్సీ వ్యాప్తంగా విస్తరించడంలో భాగంగా 2019 విద్యా సంవత్సరంలో అతి తక్కువ ఫీజుతో ముచంగిపుట్టలో కూడా ఏర్పాటు చేశారు.

➡️