సుందరయ్య ఆశయాలను సాధిస్తాం

May 19,2024 23:52
పాడేరులో సుందరయ్య చిత్ర పటానికి పూలమాల వేస్తున్న అప్పలనర్స

ప్రజాశక్తి-పాడేరు: దేశంలో ప్రజాస్వామ్యక ఉద్యమాలను మరింత బలోపేతం చేయడంతోనే పుచ్చలపల్లి సుందరయ్యకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి అప్పలనరస తెలిపారు. అల్లూరి జిల్లా వ్యాప్తంగా పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. సిపిఎం శ్రేణులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాడేరు సిపిఎం జిల్లా కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అప్పల నరస మాట్లాడుతూ, 18 సంవత్సరాలు దాటిన వయోజనులంతా గ్రామసభల్లో భాగస్వామిగా ఉండాలని సుందరయ్య కోరుకునేవారని చెప్పారు. ఎన్నికల, న్యాయ వ్యవస్థ ఎలా పని చేయాలో.. మెరుగైన ఆధునిక విద్యా, వైద్య సదుపాయాలెలా ఉండాలో నిర్దిష్టంగా పేర్కొన్నారని చెప్పారు.రైతులు, పారిశ్రామిక కార్మికులు, వృత్తిదారుల హక్కులను తెలియజేశారన్నారు. ఆనాటికీ, నేటికీ పరిస్థితుల్లో చాలా మార్పులున్నప్పటికీ సుందరయ్య కన్న కల ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణం నేడు ఒక కర్తవ్యంగా మన ముందుందన్నారు. సుందరయ్య కల నిజమవ్వాలంటే డబ్బు పాత్ర లేని ఎన్నికల వ్యవస్థ రావాలన్నారు. ప్రతి పార్టీకి ఎన్నికలకయ్యే ఖర్చును ప్రభుత్వాలే భరించాలని, ప్రజా ప్రతినిధులు దారి తప్పితే రీకాల్‌ హక్కు ప్రజలకుండాలని తెలిపారు. మతాన్ని రాజకీయాల్లో చొప్పించడాన్ని నిషేధించాలన్నారు. సిపిఎం పాడేరు మండల నాయకులు వంతాల దాస్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కామరాజు వరహాల బాబు, మత్యరాజు పాల్గొన్నారు.అరకులోయ రూరల్‌:స్థానిక ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కిండంగి రామారావు, మండల నాయకులు పొద్దు బాలదేవ్‌ మాట్లాడుతూ, సుందరయ్య భూస్వామి కుటుంబంలో జన్మించినా అణిచివేతకు గురవుతున్న పీడిత ప్రజల కోసం తన జీవితాన్నే అంకితం చేసారని కొనియాడారు. మచ్చలేని మనిషిగా పేరు పొందారన్నారు. బడుగు బలహీన వర్గానికి అండగా నిలబడి అంటరానితనం వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశార్నారు. తనకు చెందిన స్వంత భూములన్ని పేదలందరికీ పంచిపెట్టిన మహా నేత సుందరయ్య అన్ని గుర్తు చేశారు. కార్మికులకు, కర్షకులకు, రైతు కూలీలకు సంఘాలు పెట్టి పేదల పక్షాన నిలబడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పాంగి రామన్న, కొర్రా మగ్గన్న, కిల్లో జగనాదం పాల్గొన్నారు.పెదబయలు :మండల కేంద్రంలో సుందరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ సభ్యులు బొండా సన్నిబాబు మాట్లాడుతూ, చట్టసభకు సైకిల్‌పై నాయకులకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొండా సన్నిబాబు, మండల కమిటీ సభ్యులు బొండా గంగాధరం, రామారావు, శర్బన్న పాల్గొన్నారు.ఎటపాక : ప్రజా సమస్యలపై నిత్యం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేయడం ద్వారా సుందరయ్య ఆశయాలను సాధిద్దామని సిపిఎం మండల కార్యదర్శి ఐ వి అన్నారు. ఆదివారం గుండాల కాలనీలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జి హరి అధ్యక్షతన జరిగిన సభలో ఐవి మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత, వర్గ పోరాటాల రథసారథి, ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య అడుగు జాడల్లో నడుస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ దోపిడీ వర్గాల నుంచి రక్షణకు ప్రజలను నిత్యం చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ఇర్పా సత్యం, పులుసు బాలకష్ణ, ఆకిశెట్టి రాము, బుద్దుల భద్రయ్య, హరి, మాటూరి బాలకృష్ణ, సీసం అర్జున్‌, గద్దల హుస్సేన్‌, పసుపులేటి ప్రవీణ్‌, బీస్మారావు, మధు ,రఘు పాల్గొన్నారు.విఆర్‌ పురం : మండలంలోని రేఖపల్లి సిపిఎం కార్యాలయం వద్ద పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని పురస్కరించు కొని ఆయన చిత్రపటానికి పార్టీ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, జిల్లా కమిటీ సభ్యులు పూనం. సత్యనారాయణ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజకీయం అంటే ప్రజాసేవ అని నిరూపించిన వ్యక్తిగా సుందరయ్య నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి అన్నారు. సుందరయ్య కోరుకున్న సమసమాజం, కార్మికవర్గం హక్కుల సాధనకై ఉద్యమాలు ఉధృతం చేయాలన్నారు. బానిస సంకెళ్లు నుంచి కార్మికవర్గానికి విముక్తి కలిగి,సమాన పనికి సమాన వేతనం, రైతాంగానికి గిట్టుబాటు ధర, వ్యవసాయ కార్మికులకు కనీస కూలి, పేద ప్రజలందరికి ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు సాధించగలిగినప్పుడే సుందరయ్యకు నిజమైన నివాళి అన్నారు, కార్యక్రమంలో మండల నాయకులు పులి సంతోష్‌కుమార్‌ సోడి. మల్లయ్య. ఎన్‌. ప్రకాష్‌, లక్ష్మణరావు కార్యకర్తలు వెంకటరమణ, శ్రీరామ్‌ పాల్గొన్నారు..చింతూరు : పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్థంతిని పురస్కరించుకుని స్థానిక శ్యామల వెంకటరెడ్డి భవన్‌లో ఆయన చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకట్‌, సీనియర్‌ నాయకులు వై.శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. స్వతంత్ర సమరయోధుడిగా, కమ్యూనిస్టు పార్టీ నేతగా, నిస్వార్థ రాజకీయ నాయకునిగా ప్రజల కోసం సుందరయ్య చేసిన సేవలను స్మరించుకుని కొనియాడారు.కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మురం రంగమ్మ,నాయకులు పాండురం సుబ్బారావు, కారం సుబ్బారావు, పోడియం లక్ష్మణ్‌, పెద్ద రాములు పాల్గొన్నారు.రంపచోడవరం పుచ్చలపల్లి. సుందరయ్య 39వ వర్ధంతి సందర్బంగా రంపచోడవరం సిపిఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన.సీతారాం పూలదండ వేసి ఘన నివాళులర్పించారు. కమ్యూనిస్టు నాయకునిగా, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడిగా, స్వాతంత్య్ర సమర యోధుడి .పుచ్చలపల్లి సుందరయ్య సేవలను కొనియాడారు. తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడైన సుందరయ్య, కులవ్యవస్థను నిరసించారని, నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపారన్నారు. సుదీర్ఘపార్లమెంటేరియన్‌గా, సైకిల్‌పై చట్టసభలకు వెళ్లిన ఏకైక నేతగా సుందరయ్య ఆదర్శనీయుడన్నారు. కార్యక్రమంలో పార్టీ రంపచోడవరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మట్ల వాణిశ్రీ, ఈతపల్లి సిరిమల్లి రెడ్డి పాల్గొన్నారు. కూనవరం : అమరజీవి కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ సీనియర్‌ నాయకులు తలగాని నాగరాజు పూల మాల వేశారు. అనంతరం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరావు మాట్లాడుతూ సుందరయ్య సేవలను కొనియాడారు కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, జిల్లా వైస్‌ ఎంపిపి కొమరం పెంటయ్య, ఎంపీటీసీ సభ్యులు కారం జయసుధ, మాజీ ఎంపిటిసి సభ్యులు పాయం సత్యనారాయణ,మడెం బాబురావు పాల్గొన్నారు.

➡️