చెరువు ఆక్రమణకు యత్నం

Apr 9,2024 21:07

ప్రజాశక్తి- బొబ్బిలి : పట్టణంలోని నాయుడు కాలనీ గాయత్రి డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న చెరువును ఆక్రమించే ందుకు ప్రయత్నం చేస్తు న్నారు. చెరువు పక్కనున్న వారు చెరువులో వ్యర్థాలను వేసి కప్పి వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువును కాపాడా ల్సిన అధికారులు పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో మట్టి వేయడంతో పాటు చేపలు పట్టేందుకు వీలులేకుండా ముళ్ల కంపలు వేస్తున్నారు. దీంతో చెరువులో చేపలు పెంచేందుకు మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. చేపలు పెంచకుండా చెరువు ఖాళీగా ఉంటే పూర్తిగా ఆక్రమించుకునే అవకాశం ఉంటుందని అక్రమార్కులు ప్రణాళికలు వేసినట్లు విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు స్పందించి చెరువు ఆక్రమణకు గురికాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

➡️